బిజినెస్ మ్యాన్ గా అల్లు అరవింద్ కొట్టగలిగేవాళ్లు  లేరు అని సినిమా పరిశ్రమలో అందరికీ తెలుసు. స్టోరీ లైన్ విని...సినిమా విజయం స్మెల్ చేయగలిగే ఆయన కెరీర్ లో సక్సెస్ శాతం ఎక్కువ. అంతేకాదు ఆయన తన కుటుంబం నుంచి వరస పెట్టి హీరోలను దింపుతున్నా..వారికి ఒకరితో మరొకరికి పోటీ లేకుండా మ్యానేజ్ చేస్తున్నారు. తాజాగా ఆయన ఓ సీక్వెల్ సినిమా ని ప్లాన్ చేసి అటు బాలీవుడ్ లో ఇటు తమిళ, తెలుగు సినిమా పరిశ్రమల్లో సంచలనం క్రియేట్ చేసారు. ఇంతకీ ఆయన ప్లాన్ చేసిన సీక్వెల్ ఏ సినిమాకీ అంటే....తెలుగు,తమిళ,హిందీ భాషల్లో సూపర్ హిట్ అయ్యిన గజని.

తెలుగు ప్రేక్షకులకు తమిళ హీరో సూర్యను బాగా దగ్గర చేసిన చిత్రం ‘గజిని’. ఈ తమిళ సూపర్‌ హిట్‌ను తెలుగులో అల్లు అరవింద్‌ రిలీజ్‌ చేశారు. తమిళంలోలానే ఇక్కడా ఘనవిజయం సాధించింది. అంతే కాదు హిందీ వెర్షన్‌ను ఆమిర్‌తో నిర్మించారు అరవింద్‌. ఇప్పుడు ఈ సూపర్‌ హిట్‌ సినిమాకు సీక్వెల్‌ నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు అనిపిస్తోంది. 

ఎందుకంటే గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై ‘గజినీ 2’ అనే టైటిల్‌ను తెలుగు, తమిళ భాషల్లో రిజిస్టర్‌ చేయించారు. మరి ఈ సినిమా సూర్య, మురుగదాస్‌ కాంబినేషన్‌లోనే ఉండదని, కాంబినేషన్‌ మారుతుందంటున్నారు.  మరో ప్రక్క అమీర్ ఖాన్ తో ఈ సినిమా చేయబోతున్నట్లు బాలీవుడ్ మీడియా అంటోంది. అది సాధ్యం  కాకపోతే అల్లు అర్జున్ పెట్టి సినిమా చేస్తాడంటున్నారు. ఫైనల్ గా  మురగదాస్ ఎవరితో చేస్తారో చూడాలి. ఇప్పటికే ఈ సినిమాకు సంభందించి ఓ స్టోరీ లైన్ ని అల్లు అరవింద్ కు చెప్పినట్లు తెలుస్తోంది.