మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గత ఏడాది నుంచి రామాయణం ను వెండితెరపైకి తేవాలని ప్రయత్నాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఫైనల్ గా సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చింది. పూర్తిగా సినిమాను 3డి ఫార్మాట్ లో తెలుగు తమిళ్ హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. 

మూడు భాగాలుగా తెరకెక్కించబోతున్న ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేయనున్నారు. అల్లు అరవింద్ తో పాటు మధు మంతెన - నమిత్ మల్హోత్రా  రామాయణంను సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇక నటీనటులు ఎవరనేది వెలువడాల్సి ఉంది. మూడు భాగాలకు దర్శకులు అయితే ఫిక్స్ అయ్యారు. 

దంగల్ ఫెమ్ నితేశ్ తివారి - మామ్ దర్శకుడు రవి ఉద్యావర్ ఈ బిగ్ ప్రాజెక్ట్ కి దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే ఈ మెగా ప్రాజెక్ట్ కి సంబందించిన రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. గతంలో వచ్చిన టాక్ ప్రకారం సినిమాకు 500కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక మొదటి సిరీస్ ను 2021లో ఈ బడా నిర్మాతలు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.