సాధారణంగా ఓ దర్శకుడు కానీ హీరో కాని ప్లాఫ్ అయ్యితే ప్రక్కన పెడుతూంటారు నిర్మాతలు. ఎందుకంటే వాళ్లతో బిజినెస్ అవటం కష్టమని. కానీ అల్లు అరవింద్ ది రివర్స్ గేర్. ప్లాఫ్ ఇచ్చిన వాళ్లతోనే హిట్ కొట్టే మనస్తత్వం. తనపైన, తన బ్యానర్ పైన ట్రేడ్ వర్గాల్లో ఉన్న నమ్మకాన్ని అడ్డం పెట్టి బిజినెస్ చేస్తూంటారు ఆయన. ఆయన సినిమా నిర్మిస్తున్నారంటే హీరో, డైరక్టర్ ఎవరన్నది ట్రేడ్ లో అనవసరం.

ఇవన్నీ గమనించిన అల్లు అరవింద్ ..ప్లాఫ్ డైరక్టర్స్ తో వరస సినిమాలు చేస్తున్నారు.  దాంతో  గీతా ఆర్ట్స్ ..ఓ ర‌కంగా ఇది ఫ్లాప్ లు ఇచ్చిన వారికి  వ‌రంగా మారింది. దానికి తోడు ఎవరో హీరోతో సినిమా కాకుండా మినిమం రేంజి హీరోలనే ఈ దర్శకుల చేతిలో పెడుతున్నారు ఆయన. ఇలాంటి దర్శకులతో ఓ సుఖం ఉంది ఆయనకు. చెప్పినట్లుగా విని స్క్రిప్టు పై ఎంతకాలమైనా పనిచేస్తారు.

బడ్జెట్ కంట్రోలు లో ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా రెమ్యునేషన్ భారీగా ఇవ్వక్కర్లేదు. గీత గోవిందం హిట్ తో ఆయనకు మరింత ఉత్సాహం వచ్చింది. రీసెంట్ గా అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో గీతా ఆర్ట్స్ సినిమా మొద‌లైంది. ఈ సంద‌ర్భంగా వ‌రుస‌గా ప‌లు ఫ్లాపులిచ్చిన ద‌ర్శ‌కుడికి గీతా ఆర్ట్స్ సంస్థ ఎంతో న‌మ్మ‌కంగా అవ‌కాశం ఇవ్వ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. 

అలాగే మహేష్ తో `బ్ర‌హ్మోత్స‌వం` లాంటి డిజాస్ట‌ర్ మూవీని ఇచ్చిన శ్రీ‌కాంత్ అడ్డాల‌కు ఇదే బ్యానర్ లో  మ‌రో ఛాన్స్ ద‌క్కింది. గీతా ఆర్ట్స్ తో అడ్డాల ఏడాది కాలంగా జర్నీ చేస్తున్నారు. స్టోరీ డిస్కషన్స్ సాగించారు. తాజాగా బౌండ్ స్క్రిప్ట్ ఫైన‌ల్ చేసి సెట్ మీదకు వెళ్తున్నారు.  ఈసారి అత‌డు ఓ ప‌క్కా ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ స్క్రిప్టుని ఆ సంస్థ‌కు వినిపించార‌ట‌. ఆ స్క్రిప్టుకు నేచుర‌ల్ స్టార్ నాని ఓకే చెప్పార‌ని.. ఇక నాని – శ్రీ‌కాంత్ అడ్డాల సినిమా సెట్స్ కెళుతుంద‌ని తెలుస్తోంది.  ఇంకా ఇలాంటి నాలుగైదు ప్రాజెక్టులు గీతా ఆర్ట్స్ లో నడుస్తున్నాయని టాక్.