నాంది సినిమా తరువాత సీరియస్ రోల్స్ వైపు మళ్లాడు.. కామెడీ హీరో అల్లరి నరేష్.  ఇక ఇప్పుడు మరోసారి ఉగ్రం సినిమాతో.. ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ను పెంచబోతున్నాడు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసి.. అంచనాలు పెంచేశాడు అల్లరి నరేష్. 

కామెడీ రోల్స్ మానేసిన తరువాత.. కొంత కాలం గ్యాప్ ఇచ్చిన అల్లరి నరేష్‌ నాందితో మంచి కంబ్యాక్‌ ఇచ్చాడు. కంబ్యాక్‌ ఇవ్వడమే కాదు తనలోని కొత్త కోణాన్ని బయటకు తీసి.. నటుడుగా కొత్త జన్మ ఎత్తాడు. ఈ సినిమాతో నరేష్‌కు కమర్షియల్‌ బ్రేక్ వచ్చింది. నరేష్ మార్కెట్ కూడా పెరిగింది. దాంతో నరేష్ తో కొత్త కొత్తగా కాన్సెప్ట్ లు ప్లాన్ చేస్తూ.. డిఫరెంట్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. అటువంటి ప్రయోగమే ఉగ్రం. 

అల్లరి నరేష్ తో... నాంది సినిమా తెరకెక్కించి సక్సెస్ సాధించిన విజయ్‌ కనకమేడల..మరోసారి అల్లరి హీరోతో చేతులు కలిపి ఉగ్రం సినిమాను తెరకెక్కించాడు. దర్శకుడిగా తొలి అడుగులోనే నాంది సినిమాతో తిరుగులేని విజయం సాధించాడు. ఈ సినిమా సక్సెస్‌తో ఉగ్రం సినిమాతో మరోసారి వీరిద్దరూ సందడి చేయబోతున్నారు. థ్రిల్లర్‌ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈమూవీ షూటింగ్‌ పూర్తి చేసుకుని వచ్చేనెల అనగా మే 5న రిలీజ్ కు రెడీగా ఉంది. 

YouTube video player

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. ఈసినిమా ప్రమోషన్ల జోరు పెంచారు టీమ్. ఈ క్రమంలో వరుస అప్‌డేట్‌లు ప్రకటిస్తూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు. ఇక ఇందులో భాగంగా.. మేకర్స్‌ ఈ సినిమా నుంచి ట్రైలర్‌ ను రిలీజ్ చేశారు. ముందు గా ప్రకటించిన విధంగానే.. ఈమూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు టీమ్. ఈ సినిమాలో గాలి శ్రీను, శివ కుమార్‌ అనే రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు నరేష్. ట్రైలర్ చూస్తుంటే..రెండు పాత్రలను అద్భుతంగా పోషించినట్టు తెలుస్తోంది. సెంటిమెంట్, ఎమోషన్.. క్రైమ్ థ్రిల్లర్ అంశాలతో ఈమూవీ తెరకెక్కినట్టు.. ఈట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. 

ఇక ప్రస్తుతం ఉగ్రం ట్రైలర్ రిలీజ్ అవ్వడంతోనే ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. క్రైమ్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కిస్తున్నఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ధి నిర్మిస్తున్నారు. నరేష్‌కు జోడీగా మిర్నా మీనన్‌ నటిస్తుంది. శ్రీచరణ్‌ పాకాలా సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు అబ్బూరి రవి మాటలు రాస్తున్నాడు.