సడన్ గా యాక్షన్ హీరో అవతారం ఎత్తాడు అల్లరి నరేష్. ఇకపై నానుండి ఇలాంటి చిత్రాలే వస్తాయంటున్నారు. అయితే ఆ జోనర్లో సక్సెస్ కావడం అంత ఈజీ కాదంటున్నారు విశ్లేషకులు. 

పరిశ్రమలో మాస్ హీరోలదే హవా. మాస్ అండ్ యాక్షన్ హీరోగా సక్సెస్ అయితే వందల కోట్ల సంపాదన, అశేష అభిమానగణం సొంతం అవుతుంది. ఏళ్ల తరబడి పరిశ్రమలో హీరోగా ఉండే మైలేజ్ దక్కుతుంది. అందుకే ప్రతి నటుడు ఆ ఇమేజ్ కోసం ట్రై చేస్తారు. స్టార్ కిడ్స్ అయితే డెబ్యూ చిత్రాలే మాస్ సబ్జక్ట్స్ ఎంచుకుంటారు. మాస్ హీరో ఇమేజ్ కి ఉన్న వెయిట్ అలాంటిది మరి. 

20 ఏళ్ల జర్నీ తర్వాత అల్లరి నరేష్ మాస్ హీరో కావాలనుకుంటున్నారు. ఆ క్రమంలో ఉగ్రం మూవీ చేశారు. దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కించారు. గతంలో వీరి కాంబోలో నాంది తెరకెక్కింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నాందిలో నరేష్ ని ఖైదీగా ప్రజెంట్ చేసిన విజయ్ ఉగ్రం మూవీలో పోలీస్ గా పరిచయం చేస్తున్నారు. గతంలో అల్లరి నరేష్ పోలీస్ రోల్స్ చేశారు. అయితే అవి కామెడీ పోలీస్ టైప్. ఉగ్రంలో మాత్రం అవుట్ అండ్ అవుట్ సీరియస్ కాప్ రోల్. 

ఒక సాయి కుమార్ మరో రాజశేఖర్ ను అల్లరి నరేష్ గుర్తు చేశాడు. కాగా అల్లరి నరేష్ ఈ మధ్య సీరియస్ సబ్జక్ట్స్ ఎంచుకుంటున్నారు. నాంది, మారేడుమిల్లి నియోజకవర్గం ప్రస్తుతం ఉగ్రం ఆయన ఇమేజ్ కి భిన్నంగా తెరకెక్కిన చిత్రాలు. ఇకపై కామెడీ చిత్రాలు చేసేది లేదని అల్లరి నరేష్ తేల్చిచెప్పారు. ఈ క్రమంలో ఆయన కామెడీ హీరో ఇమేజ్ నుండి బయటపడాలని చూస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది. 

అదే సమయంలో ఆయన మాస్ హీరో ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నారని చెప్పకనే చెప్పాడు. ఈ నిర్ణయం వెనుక బలమైన కారణం కూడా ఉంది. నరేష్ సినిమాలు ఆడటం లేదు. ఆయన బంపర్ హిట్ కొట్టి దశాబ్దం దాటిపోయింది. ఆయన కామెడీ సినిమాల్లో మూసధోరణి రాగా... జనాలు పట్టించుకోవడం మానేశారు. అందుకే ఇలాంటి భిన్నమైన సబ్జెక్ట్స్ ఎంచుకుంటారు. అయితే పంథా మార్చినంత మాత్రాన సక్సెస్ అవుతామనే గ్యారంటీ ఉండదు. తన బాడీ లాంగ్వేజ్ కి కామెడీ సెట్ అవుతుందని నమ్మిన అల్లరి నరేష్... డెబ్యూ మూవీతోనే తన లక్ష్యం కామెడీ హీరోగా ఎదగడమని ఫిక్స్ అయ్యాడు. అనుకున్నట్లే సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు కామెడీ చిత్రాలు ఆడటం లేదని మాస్ చిత్రాలు చేస్తానంటే సక్సెస్ అవుతారని చెప్పలేం. కాబట్టి ఇది కత్తిమీద సామే! 

YouTube video player