సుడిగాడు మళ్ళీ వచ్చేస్తున్నాడు.. ఈసారి ఏన్ని సినిమాలు చూపిస్తారో..?
గెట్ రెడీ కామెడీ లవర్స్.. అల్లరోడు మళ్లీ వస్తున్నాడు. ఈసారి మరికొన్ని సినిమాల స్పూఫ్ లతో సందడి చేయబోతున్నారు. ఆంతకీ ఈ వార్తల్లో నిజం ఎంత..?

ఒక్క టికెట్ మీద ఓ పది సినిమాలు చూపించిన దర్శకుడు భీమినేని శ్రీనివాస్. అల్లరి నరేష్ హీరోగా నటించిన సుడిగాడు సినిమాతో ఆడియన్స్ కు ఈ ఫీలింగ్ ను తీసుకువచ్చాడు. కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తూ.. ఒక సీన్ కు ఇంకో సీన్ కు సబంధం లేకపోయినా.. అల్లేసి.. కలివిడి గందరగోళం చేసి.. మొత్తానికి సూపర్ హిట్ కొట్టాడు. అప్పట్లో సుడిగాడు సినిమాకు వచ్చిన రెస్పాన్స అంతా ఇంతా కాదు.. ఈసినిమా థియేటర్లలో పూయించిన నవ్వులు కూడా అన్నీ ఇన్నీ కావు. ఇక ఇప్పుడు సుడిగాడు మరోసారి సందడి చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలస్తోంది. సుడిగాడు 2 సినిమాకుసన్నాహాలు జరుగుతున్నాయట.
ఈ సినిమా కోసం అల్లరి నరేష్ ను ఎవరు కొంత మంది అప్రోచ్ అయినట్టు తెలుస్తోంది. నరేష్ దగ్గరకు మంచి స్క్రిప్ట్ కూడా వెళ్లిందట. ఇక ఫస్ట్ పార్ట్ తరహాలోనే.. లేటెస్ట్ సినిమాల స్పూఫ్ తో.. ఈమూవీని తెరకెక్కించాలి అని అనుకుంటున్నారట. ఈసారి ఇంకా ఎక్కువగ రివర్స్ గేర్ వేసి.. ఆడియన్స్ ను ఇంకా గట్టిగా ఎంటర్టైన్ చేయాలని చూస్తున్నారట టీమ్.
అసలు ఈమూవీకి సీక్వెల్ చేయాలని రిలీజ్ అప్పుడే అనుకున్నారట. అంతే కాదు దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు కథ రాస్తున్నారు అని అన్నారు. అయితే ఆ తర్వాత ఆయన హవా తగ్గడం, నరేశ్ సీరియస్ సినిమాలవైపు వెళ్లడంతో మళ్లీ కథ మొదటికొచ్చింది. ఓ ఎనిమిది నెలల క్రితం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఉంటుంది అని వార్తలొచ్చాయి కానీ అవ్వలేదు. ఇక మళ్ళీ గ్యాప్ తరువాత రీసెంట్ గా ఈసినిమా సీక్వెల్ మ్యాటర్ బయటకు వచ్చింది.
ఫస్ట్ పార్టు తరహాలోనే హిట్ సినిమాల స్పూఫ్ సన్నివేశాలతో సినిమా కథను సిద్ధం చేశారని చెబుతున్నారు. ఈసారి పాన్ ఇండియా సినిమాలకు స్ఫూఫ్ రెడీ అంటున్నారు. అయితే దర్శకుడు ఎవరు అనే విషయంలో క్లారిటీ రావడం లేదు. భీమనేని చేస్తారా? లేక కొత్త దర్శకుడా అనేది చూడాలి.
పైన చెప్పినట్లు ‘సుడిగాడు’లో (Sudigaadu2) వంద సినిమాల రిఫరెన్స్‌లు కనిపిస్తాయి. ఆ సన్నివేశాలకు స్పూఫ్‌గా భీమనేని రాసుకున్నారు అప్పుడు. మరి ఇప్పుడు అంతే నవ్వు తెప్పించేలా లైటర్ వీన్‌లో ఎవరు రాస్తారు, ఎలా రాస్తారు అనేది ఇక్కడ ఆసక్తికరం. ఒకవేళ ఈ సినిమా వస్తే మాత్రం అదిరిపోతుంది అని చెప్పాలి. ఎందుకంటే అంతలా మన ప్రేక్షకులు నవ్వుకుని చాలా రోజులు అయ్యింది.