Asianet News TeluguAsianet News Telugu

అదే జరిగితే మున్ముందు థియేటర్లు కళ్యాణమండపాలవుతాయిః అల్లరి నరేష్‌ షాకింగ్‌ కామెంట్స్

కిరణ్‌ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్‌ జంటగా నటించిన `SR క‌ళ్యాణమండపం EST 1975` ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో అల్లరి నరేష్‌ థియేటర్లపై షాకింగ్‌ కామెంట్స్ చేశారు. 

allari naresh shocking comments on theaters in sr kalyanamandapam pre release event
Author
Hyderabad, First Published Aug 4, 2021, 3:07 PM IST

`థియేటర్‌కి ఆడియెన్స్ రావాలని, వస్తేనే సినిమాలు ఆడతాయని, సినిమాలను ఆదరించడంలో మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ముందుంటారని, వారిప్పుడు థియేటర్లకి రాకపోతే ఇకపై అవి కళ్యాణమండపాలుగా మారిపోతాయి` అని అన్నారు హీరో అల్లరి నరేష్‌. ఈ ఏడాది `నాంది` సినిమాతో సూపర్‌ హిట్‌ అందుకుని ఫుల్‌ జోష్‌లో ఉన్న ఆయన తాజాగా కిరణ్‌ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్‌ జంటగా నటించిన `sR క‌ళ్యాణమండపం EST 1975` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి గెస్ట్ గా వచ్చారు. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై నూత‌న దర్శ‌కుడు శ్రీధర్ గాదె దర్శకత్వంలో  ప్ర‌మోద్, రాజు లు నిర్మిస్తున్న చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది. 

ఈ సందర్బంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన పాల్గొని చిత్ర బృందానికి బెస్ట్ విషెస్‌ తెలిపారు. ఈ సినిమా హిట్‌ అయితే ప్రతి వారం నాలుగైదు సినిమాలతో థియేటర్లు కళకళలాడుతాయన్నారు. ఇవాళ్టి రోజుల్లో సినిమా తీయడకష్టం, విడుదల చేయడం ఇంకా కష్టమన్నారు. డిసెంబర్‌ నుంచి ఏప్పిల్‌ వరకు 20 వారాల్లో 16 హిట్లు ఇచ్చిన ఘనత తెలుగు చిత్ర పరిశ్రమకే సాధ్యమని, అది తెలుగు ఆడియెన్స్ వల్లే సాధ్యమైందన్నారు. 

హీరో రాజశేఖర్ మాట్లాడుతూ, `మామూలుగా సినిమా తీయడమే కష్టం అది ఈ కష్టకాలంలో సినిమా చేసి థియేటర్కు తీసుకురావడం అనేది ఇంకా చాలా కష్టం. సో ఇన్ని కష్టాలు పడి ఈ సినిమాను ఈ నెల 6న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరు కుంటున్నా` అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవిత, హీరోలు కార్తికేయ, తేజ సజ్జా, దర్శకుడు తరుణ్ భాస్కర్‌, నిర్మాత రాజ్ కందుకూరి, దర్శకుడు నక్కిన త్రినాథ్, దర్శకుడు తరుణ్ భాస్కర్, ఫిలిం ఛాంబర్  వైస్ ప్రెసిడెంట్ ముత్యాల రాందాస్, సాయి సుశాంత్,  అవసరాల శ్రీనివాస్ తదితరులు  ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలియ జేశారు. చిత్ర బృందం తమ సినిమాని ఆదరించాలని కోరుకున్నారు. ఈ సినిమాని దాదాపు ఆరు వందల థియేటర్లలో రిలీజ్‌ చేయబోతున్నట్టు చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios