ఓ పెద్ద సినిమా చేస్తున్నప్పుడు మిగతా ప్రాజెక్టులు ఏమీ చేయటం కుదరవు. ఎంత ప్లానింగ్ ఉన్నా కష్టం. అందుకే పెద్ద సినిమా ఒప్పుకునేటప్పుడు డేట్స్ ని ఎడ్జెస్ట్ చేయగలిగితేనే కమిటవుతారు. లేకపోతే అల్లరి నరేష్ తాజా చిత్రంగా పరిస్దితి తయారువుతుంది. గుర్తుందో లేదో కానీ  అల్లరి నరేష్ హీరోగా 'బంగారు బుల్లోడు' సినిమా ఆ మధ్యన చాలా కాలం క్రితం మొదలైంది. లెక్క ప్రకారం మొదట అనుకున్నట్లు షూటింగ్ జరిగితే ఈ పాటికి సినిమా రిలీజైపోవాలి.  అయితే షూటింగ్ స్టార్ట్ చేసాక వచ్చిన షెడ్యూల్ గ్యాప్ లో నరేష్ ఈ సినిమాను పక్కన పెట్టి 'మహర్షి' చేసారు. 

నిర్మాతలు కూడా మహేష్ సినిమా కాబట్టి ఓకే అనేసారు. అలా ఆ సినిమా ప్రక్కకు వెళ్లింది. ఇప్పుడు మళ్లీ ఆ సినిమాను మొదలెట్టాడు అల్లరోడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ కి చేరుకుందని సమాచారం. ఈ విషయం గుర్తు చేస్తూ ఇండిపెండెన్స్ డే సందర్భంగా  'బంగారు బుల్లోడు' రిలీజ్ అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ వదిలాడు. నవంబర్ లో దీపావళి కానుకగా సినిమా రిలీజ్ అంటూ ప్రకటించారు నిర్మాతలు.  

అల్లరి నరేష్, పూజా జవేరితో పాటు తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, ప్రవీణ్, వెన్నెలకిషోర్, సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను, జబర్దస్త్ మహేష్, అనంత్, భద్రం, అజయ్ ఘోష్, సారిక రామచంద్రరావు, రమాప్రభ, రజిత, శ్యామల ఈ చిత్రంలో నటిస్తున్నారు. వెలిగొండ శ్రీనివాస్ మాటలు రాసిన ఈ చిత్రానికి రామజోగయ్య శాస్త్రి పాటలకు సాహిత్యం అందించారు. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందించారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ కిషోర్ గరికపాటి, కో ప్రొడ్యూసర్: అజయ్ సుంకర, ప్రొడ్యూసర్: సుంకర రామబ్రహ్మం, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పి.వి.గిరి.