అల్లరి నరేష్ గత కొన్ని ఏళ్లు గా వరస పెట్టి డిజాస్టర్స్ ని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం బంగారు బుల్లోడు,నాంది సినిమాలు చేస్తున్నాడు.  బంగారు బుల్లోడు చిత్రం క్రితం సంవత్సరం ప్రారంభంలో మొదలైనా రకరకాల కారణాలతో ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు. ఈ లోగా నరేష్ దగ్గరకి ఓ క్రేజీ ఆఫర్ వచ్చింది. అదీ కాజల్ సరసన కనిపించటానికి అని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ప్రొడ్యూస్ చేయటానికి ముందుకొచ్చారు. ఇంక ఆలోచించేదేముంది...జస్ట్ ...ఓకే అని రెండు అక్షరాలు అనేసాడట. అయితే కాజల్ ఇంకా ఆలోచనలో ఉందని చెప్తున్నారు. నరేష్ ప్రక్కన చేస్తే తర్వాత తన కెరీర్ పరిస్దితి ఏమిటి అనే డైలమోలో ఉందిట. అయితే సినిమాలో కాజల్ దే మెయిన్ పాత్ర అని చెప్తున్నారు. 

దానికి తోడు ఇదో కొరియా చిత్రం రీమేక్ అని తెలుస్తోంది. సురేష్ బాబు వంటి ప్రముఖ నిర్మాత అడిగాక ఇంక వెనకడుగు వేసే ధైర్యం కాజల్ చేస్తుందా అని ఇండస్ట్రీ అంటోంది. ఇంతకీ ఆ కొరియా సినిమా పేరు డాన్సింగ్ క్వీన్ అని సమాచారం. మ్యూజికల్ కామెడీగా సాగే ఈ సినిమాని మంచి డైరక్టర్ చేతిలో పెట్టాలనే ఆలోచనతో సురేష్ బాబు ఉన్నారట. ఈ సినిమాలో నరేష్ ఓ లాయిర్ గా కనిపిస్తాడని చెప్తున్నారు. 

చెట్టు క్రింద లాయిర్ లాంటి అతను...ఓ వ్యక్తిని మెట్రో రైల్ నుంచి పడిపోతూంటే పట్టుకుని సేవ్ చేయటంతో  రాత్రికి రాత్రి నరేష్ మీడియాలో హాట్ పర్శన్ గా మారిపోయి..అది చివరకు తమ సిటీ మేయర్ గా పోటీ చేసే స్దాయికి చేరుకుంటుంది. అయితే అదే సమయంలో అతని భార్య ...పాప్ సింగర్ అవ్వాలని నిర్ణయించుకుంటుంది. ఆమె పాప్ సింగర్ అయితే తన పొలిటికల్ ప్రస్దానానికి ఇబ్బంది అవుతుందని భావిస్తాడు. కానీ తన చిన్న నాటి కలను ఆమె వదులుకోవటానికి ఇష్టపడదు. ఈ క్రమంలో వచ్చే ఫన్, ఎమోషన్ ఈ సినిమాలో హైలెట్. 

ఇక ఈ ప్రాజెక్టు  ఇంకా పూర్తి స్దాయిలో ఫైనలైజ్ కాలేదని తెలుస్తోంది. ఇంకా చర్చల స్దాయిలో ఉన్న ఈ సినిమాకు తెలుగు వెర్షన్ స్క్రిప్టు రాయిస్తున్నారట. తెలుగులో ఓ బేబి హిట్ అవటంతో ...ఈ సినిమా కూడా ఆడుతుందని సురేష్ బాబు ఉత్సాహంగా ఉన్నారట. తక్కువ బడ్జెట్ లో రెడీ అయ్యే ఈ సినిమా కనక మొదలైతే నరేష్ జాక్ పాట్ కొట్టినట్లే.