Asianet News TeluguAsianet News Telugu

`ఆ ఒక్కటి అడక్కు` ఫస్ట్ లుక్‌.. మళ్లీ సేఫ్‌ జోన్‌లోకి వెళ్లిన అల్లరి నరేష్‌.. రిస్కేమో?

అల్లరి నరేష్‌ ఇటీవల యాక్షన్‌, థ్రిల్లర్‌ మూవీస్‌తో అలరించారు. విజయాలు అందుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ జోనర్‌ మార్చాడు. కొత్త సినిమాని ప్రకటించారు.

allari naresh next movie aa okkati adakku title teaser interesting arj
Author
First Published Feb 16, 2024, 5:50 PM IST | Last Updated Feb 16, 2024, 5:50 PM IST

అల్లరి నరేష్‌.. కామెడీ సినిమాలకు కేరాఫ్‌. కామెడీ సినిమాలతోనే హీరోగా ఎదిగాడు. కానీ ఒకానొక దశలో ఆయన వరుస ఫెయిల్యూర్స్ అందుకున్నారు. ఎన్ని రకాల కామెడీ సినిమాలు చేసినా వర్కౌట్‌ కాలేదు. దీంతో రూట్‌ మార్చాడు. యాక్షన్ సినిమాలు చేశాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీస్‌తో విజయాలు అందుకున్నారు.

అలా అల్లరి నరేష్‌ `నాంది` మూవీతో బంపర్‌ హిట్‌ కొట్టాడు. ఈ మూవీ అనూహ్య విజయం సాధించింది. ఇందులో సీరియస్‌ రోల్‌లో నటించాడు అల్లరి నరేష్‌. ఆ తర్వాత మరోసారి అలాంటి పాత్రతోనే `ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం` మూవీతో వచ్చాడు. ఈ మూవీ పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత వచ్చిన `ఉగ్రం` మూవీ ఫర్వాలేదనిపించుకుంది. ఇటీవల నాగార్జునతో కలిసి చేసిన `నా సామిరంగ` మూవీ సంక్రాంతికి వచ్చి అదిరిపోయే విజయాన్ని అందుకున్నారు. 

ఈ నేపథ్యంలో మరో క్రేజీ మూవీతో వస్తున్నారు. తాజాగా కొత్త సినిమాని ప్రకటించారు. `ఆ ఒక్కటి అడక్కు` అనే పేరుతో కొత్త సినిమాని చేస్తున్నారు. ఈ మూవీ టైటిల్‌ గ్లింప్స్ ని విడుదల చేశారు. ఈ మేరకు విడుదల చేసిన టీజర్‌ క్రేజీగా ఉంది. ఇందులో తన అపార్ట్ మెంట్‌లో అంతా పెళ్లెప్పుడు అని అడుగుతుంటారు. దీంతో దోశలు వేసే పెనం పట్టుకుని పౌరుషంగా వెళ్తాడు. తీరా చూస్తే వెన్నెల కిషోర్‌ చేతిలో ఆ పెనం పెట్టి ఆ ఒక్కటి అడక్కు అంటాడు అల్లరి నరేష్‌. ఈ మూవీని మార్చి 22న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

ఇదిలా ఉంటే గతంలో కామెడీ సినిమాలు చేసి విఫలమయ్యాడు అల్లరి నరేష్‌. కానీ ఇప్పుడు మళ్లీ అదే కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సినిమాతో వస్తున్నట్టు తాజా టీజర్‌ని చూస్తుంటే అర్థమవుతుంది. మళ్లీ వింటేజ్‌ అల్లరిని చూపించబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఇది ఎంత వరకు వర్కౌట్‌ అవుతుందో చూడాలి. ఇందులో అల్లరి నరేష్‌ కి జోడీగా ఫరియా అబ్దుల్లా నటిస్తుంది. ఇందులో అరియానా గ్లోరీ నటిస్తుండటం విశేషం. వెన్నెల కిషోర్‌, వైవా హర్ష, జామీ లెవర్‌ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మల్లి అంకం దర్శకుడు. చిలక ప్రొడక్షన్‌ పతాకంపై రాజీవ్‌ చిలక నిర్మిస్తున్నారు. 

Read more: దసరాకి `దేవర`.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే.. ఎన్టీఆర్‌ కొత్త పోస్టర్‌ అదిరింది..

Also read: 24 ఏళ్ల క్రితం అనసూయ రేర్ ఫోటో, గుర్తు పట్టడం కష్టమే..నాట్ బాడ్ అంటూ తన అందం గురించి కామెంట్స్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios