Min read

అల్లరి నరేష్పై ‘పొలిమేర’ప్రయోగం : టీజర్ చూసారా?!

Allari naresh 12a railway colony teaser released in Telugu jsp
Allari naresh 12a railway colony teaser released in telugu

Synopsis

అల్లరి నరేష్ కొత్త సినిమా '12ఎ రైల్వే కాలనీ' టీజర్ విడుదలైంది. హార్రర్ థ్రిల్లర్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాని కాసరగడ్డ దర్శకత్వం వహిస్తున్నారు.

కామెడీ సినిమాల నుంచి ప్రక్కకు వచ్చి వరసగా సినిమాలు చేస్తున్న అల్లరి నరేష్ (Allari Naresh)ఈ సారి జానర్ మార్చారు. అల్లరి నరేష్ హీరోగా కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది.  కొత్త సినిమాకు సంబంధించి టైటిల్ అనౌన్స్ చేస్తూ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. నాని కాసరగడ్డ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీకి ‘12ఎ రైల్వే కాలనీ’టైటిల్ ఫిక్స్ చేశారు. పొలిమేర’,‘పొలిమేర 2’ సినిమాలకి పనిచేసిన రైటర్‌ కం డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ కథను అందించారు. అంతేకాకుండా కథ, స్క్రీన్ ప్లే, మాటలు & షోరన్నర్గా అనిల్ వ్యవహరించారు.

టీజర్ విషయానికి వస్తే.. ‘12ఎ రైల్వే కాలనీ’టీజర్ హార్రర్ నేపథ్యంతో థ్రిల్లింగ్గా ఉంది. "ఈ ఆత్మలు కొంతమందికే ఎందుకు కనిపిస్తాయి. అందరికీ ఎందుకు కనిపించవు" అనే డైలాగ్తో టీజర్ మొదలై సినిమాపై సస్పెన్స్ క్రియేట్ చేసింది. ‘ప్రాణాలతో బయటకు పోవుడు అవసరం లేదన్న...!’’అంటూ టీజర్‌ చివర్లో నరేశ్‌ చెప్పే డైలాగ్ ఉత్కంఠ రేపుతోంది. అలాగే ఇందులో కనిపించే పాత్రలు ఒక్కటిగా చూపిస్తూ ఆసక్తి రేపారు.

 

ఇక కాస్టింగ్ విషయానికి వస్తే....దాదాపు పొలిమేర సిరీస్లో నటించిన వారే ఇందులో కనిపించడం విశేషం. వీటికి తోడు భీమ్స్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరింత భయపడేలా చేస్తోంది. మరి పొలిమేర లాంటి ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నట్లు టీజర్ చూస్తే అర్ధమవుతోంది. సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో అల్లరి నరేష్ తో పాటు డాక్టర్ కామాక్షి భాస్కర్ల, సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనీష్ కురువిల్లా, మధుమణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. వేసవిలో విడుదల ప్లాన్ చేస్తున్నారు.
 

Latest Videos