Asianet News TeluguAsianet News Telugu

ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్స్ లో 2.0

సౌత్ సినిమాలకు విదేశాల్లో మంచి ఆదరణ అందుతోందని రికార్డ్ ద్వారా క్లియర్ గా అర్ధమవుతోంది. పక్కింటి హాలీవుడ్ కూరకు ఎంత అలవాటు పడినా కూడా ప్రవాసులు సొంత సౌత్ ఇండియన్ సినిమాలను వదిలిపెట్టడం లేదు. 

ALL TIME BIGGEST HITS IN 2 POINTO
Author
Hyderabad, First Published Dec 10, 2018, 8:39 PM IST

సౌత్ సినిమాలకు విదేశాల్లో మంచి ఆదరణ అందుతోందని రికార్డ్ ద్వారా క్లియర్ గా అర్ధమవుతోంది. పక్కింటి హాలీవుడ్ కూరకు ఎంత అలవాటు పడినా కూడా ప్రవాసులు సొంత సౌత్ ఇండియన్ సినిమాలను వదిలిపెట్టడం లేదు. వాళ్లకు నచ్చింది అంటే సినిమా రిజల్ట్ ఒక్కసారిగా మారిపోతుంది. 2.0 యూఎస్ లో ఇప్పుడు సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. 

మొదట్లో కలెక్షన్స్ చూసి కంగారుపెట్టినా ఆ తరువాత 2.0 వీకెండ్స్ ను టార్గెట్ చేసి మంచి లాభాలను అందించింది. ఇప్పుడు 5 మిలియన్ డాలర్స్ ను క్రాస్ చేసి ఇండియన్ బెస్ట్ ఫిల్మ్ గా 2.0 నిలిచింది. ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్స్ లో మూడవ స్థానానికి చేరుకుంది. 

బాహుబలి ఫస్ట్ పార్ట్ $6.5 మిలియన్స్ తో రెండవ స్థానంలో ఉండగా బాహుబలి 2 లైఫ్ టైమ్ గ్రాస్ $20.5 మిలియన్స్ తో మొదటి స్థానంలో ఉంది. 2.0 $5M కలెక్షన్స్ తో మూడవ స్థానాన్ని దక్కించుకొని నాట్ అవుట్ గా బాక్స్ ఆఫీస్ గ్రీజ్ లో ఉంది. చూస్తుంటే 7 మిలియన్ గ్రాస్ ను అందుకునేలా ఉన్నట్లు కనిపిస్తోంది. మరి ఈ విజువల్ వండర్ యూఎస్ లో ఎంతవరకు రాబడుతుందో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios