కొన్నాళ్లుగా పానిక్ తో వున్న తారక్ ఫ్యాన్స్ కి తీపి కబురు. జూనియర్ ఎన్టీయార్ గాయపడ్డాడన్న వార్తలు ఒట్టి అబద్ధమని తేలిపోయింది. రాజమౌళి అప్కమింగ్ మూవీ ఫోటో షూట్ కోసం తారక్, చెర్రీ లాస్ ఏంజిల్స్ వెళ్లిన విషయం తెలిసిందే. ఒక స్టూడియోలో ప్రమాదవశాత్తూ జరిగిన ఒక ఘటనలో తారక్ గాయపడ్డాడని కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు హోరెత్తించాయి. అయితే ఇవన్నీ కేవలం వదంతులేనని స్పష్టమైపోయింది. జక్కన్న కొడుకు కార్తికేయ మరికొందరు టెక్నీషియన్లతో కలిసి నిర్వహించిన ఫోటో షూట్ ముగిసి.. తారక్ హైదరాబాద్ చేరుకున్నాడు. ఎన్టీయార్ క్షేమంగా, పూర్తి ఆరోగ్యంగా వున్నట్టు ఆయన సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మేకోవర్ కోసం సిక్స్ ప్యాక్ బిల్డ్ చేయడంలో బిజీగా ఉన్నట్లు సమాచారం.