`ఆదిపురుష్‌` సినిమాపై నెగటివిటీ మాత్రం తగ్గడం లేదు కదా, మరింత పెరుగుతుంది. పరోక్షంగా సినిమాకిది హెల్ప్ అవుతుండటం విశేషం. తాజాగా ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్‌ సినిమాని బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

ప్రభాస్‌ నటించిన `ఆదిపురుష్‌` చిత్రం శుక్రవారం విడుదలై వీకెండ్‌లో భారీ కలెక్షన్లతో దుమ్మురేపింది. భారీ ట్రోలింగ్‌, విపరీతమైన నెగటివ్‌ కామెంట్ల నడుము సినిమా ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం విశేషం. మూడు రోజుల్లో ఈ సినిమా 340కోట్లు చేసింది. సోమవారం మరో ముప్పై ఐదు కోట్లు రాబట్టింది. సోమవారం నుంచి కలెక్షన్లు పడిపోయాయి. అయితే ఇదే కలెక్షన్లు ఈ వారం కొనసాగితే, సినిమా ఐదు వందల కోట్లకి రీచ్ అవుతుంది. కొన్న బయ్యర్లు, నిర్మాతలు సేఫ్‌లో ఉంటారు. మరి ఆ రేంజ్‌లో సత్తా చాటుతుందా? అనేది చూడాలి. 

ఇదిలా ఉంటే సినిమాపై నెగటివిటీ మాత్రం తగ్గడం లేదు కదా, మరింత పెరుగుతుంది. పరోక్షంగా సినిమాకిది హెల్ప్ అవుతుండటం విశేషం. తాజాగా ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్‌ సినిమాని బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. `ఆదిపురుష్‌`ని దేశ వ్యాప్తంగా బ్యాన్‌ చేయాలని, ఓటీటీలోనూ రాకుండా చేయాలని కోరుతూ ఏకంగా ప్రధాని మోడీకి లేఖ రాశారు. ప్రస్తుతం ఆ లేఖ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

ఇందులో సినిమా వర్కర్స్ చెబుతూ, `ఆదిపురుష్‌` సినిమాని తక్షణమే బ్యాన్‌ చేయాలని వారు ఈ లేఖలో డిమాండ్‌ చేశారు. రాముడితోపాటు హనుమంతుడి గౌరవ ప్రతిష్టలు దెబ్బతినేలా `ఆదిపురుష్‌`లో స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ ఉన్నాయని వారు తెలిపారు. హిందూ మతాన్ని సనాతన ధర్మం, సాంప్రదాయాలను దెబ్బతీసేలా ఈ సినిమా ఉందన్నారు. కులమత బేధాలతో సంబంధం లేకుండా భారత దేశంలోని ప్రతి ఒక్కరు రాముడిని దేవుడిలా కొలుస్తారని, అలాంటి రాముడిని, అంతేకాదు రావణ్‌ పాత్రని సైతం వీడియో గేమ్‌లోని పాత్రలను చూపించినట్టుగా చూపించారని వారు ఆరోపించారు. 

దీంతో `ఆదిపురుష్‌` సినిమా స్క్రీనింగ్‌ని వెంటనే నిలిపి వేయాలని తెలిపారు. సినిమాని బ్యాన్‌ చేయాలని, భవిష్యత్‌లో థియేటర్లతోపాటు ఓటీటీలోనూ ఈసినిమా రిలీజ్‌ కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు హిందూ మనోభావాలను దెబ్బతీసే సినిమా చేసిన దర్శకుడు ఓం రౌత్‌, రైటర్‌, నిర్మాతలపై వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి అరెస్ట్ చేయాలని వారు వెల్లడించారు. కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, అలాగే కేంద్ర సెన్సార్‌ బోర్డ్ చైర్మెన్ ప్రసూన్‌ జోషీలకు ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్‌ అధ్యక్షుడు సురేష్‌ శ్యామలాల్‌ గుప్తా వెల్లడించారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

`ఆదిపురుష్‌` సినిమాలో రాఘవుడిగా ప్రభాస్, జానకిగా కృతి సనన్‌ నటించారు. రావణ్‌గా సైఫ్‌ అలీ ఖాన్‌ చేశారు. హనుమంతుడిగా దేవదత్తా, శేష్‌గా సన్నీ సింగ్‌ నటించారు. రామయణంలోని సీతని రావణుడు ఎత్తుకెళ్లడం నుంచి ఆయనతో రాముడు యుద్ధం చేసి సీతని తీసుకురావడం వరకు ఈ సినిమా సాగుతుంది. దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో టీ సిరీస్‌ దీన్ని నిర్మించింది. తెలుగు రాష్ట్రాల్లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దీన్ని రిలీజ్‌ చేసింది.