దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'RRR' సినిమాకి సంబంధించిన విషయాలను ఈరోజు మీడియా ముందు వెల్లడించారు. ఈ క్రమంలో సినిమాలో చరణ్, తారక్ ల సరసన నటించే హీరోయిన్ల పేర్లను అనౌన్స్ చేశారు.

ఒకరు బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కాగా, మరొకరు బ్రిటీష్ సుందరి డైసీ ఎడ్గర్ జోన్స్. ఎప్పుడైతే రాజమౌళి డైసీ పేరు అనౌన్స్ చేశారో.. గూగుల్ లో ఈమె గురించి వెతకడం మొదలుపెట్టారు నెటిజన్లు.

ఈమె హాలీవుడ్ నటి. ఐదేళ్ల వయసులోనే స్కూల్ లో ఓ నాటకంలో నటించి మంచి పేరు తెచ్చుకొని అప్పటి నుండి తన ప్రతిభను మరింత మెరుగుపరుచుకునే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. లండన్ కు చెందిన ఈ బ్యూటీ మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన నటిగా టర్న్ తీసుకుంది. 'పాండ్ లైఫ్' , 'వార్ ఆఫ్ వర్డ్స్', 'కోల్డ్ ఫీట్' వంటి చిత్రాల్లో నటించింది.

సినిమాల్లోనే కాకుండా 'అవుట్ నంబర్డ్' , 'సైలెంట్ విట్నెస్' వంటి టీవీ షోలు కూడా చేసింది. థియేటర్ డ్రామాల్లో డైసీకి మంచి పాపులారిటీ ఉంది. పద్నాలుగేళ్ళ వయసులోనే నేషనల్ యూత్ థియేటర్ లో భాగంగా మారింది. రాజమౌళి సినిమాలో అవకాశం దక్కించుకున్న ఈ లండన్ భామ ఈ సినిమాతో మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తుంది.