Asianet News TeluguAsianet News Telugu

'ఆరెంజ్' రీరిలీజ్‌.. ఓ షాకింగ్ రియాక్షన్, ఇలా కూడా జరుగుతుందా?

బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకున్నా.. మ్యూజికల్‌గా మాత్రం మంచి టాక్‌ తెచ్చుకుంది ఆరెంజ్‌.అయితే అప్పటి జనాలకు నచ్చలేదు. ఇప్పుడీ చిత్రం థియేటర్స్ లో డాన్స్ లు చేయిస్తోంది.

All about Ram Charan Orange Re Release Bookings
Author
First Published Mar 27, 2023, 9:49 AM IST

ప్రతీ దానికి తనకంటూ టైమ్ వస్తుందని సినిమా వాళ్లు బాగా నమ్ముతారు. అందుకే ఒక్కోసారి డిజాస్టర్ అనుకున్న సినిమా ..కాల క్రమంలో కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోవచ్చు. అలా చాలా సినిమాలు తమ ప్రత్యేకతను రిలీజైన చాలా కాలం తర్వాత చూపించుకుంటూ వచ్చాయి. ఇప్పుడు రామ్ చరణ్  చిత్రం ఆరెంజ్ వంతు వచ్చింది.  అంజనా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రం నాగబాబుకు తీవ్ర నష్టాలను తెచ్చిపెట్టిన ఈ సినిమా రీరిలీజ్ లో వండర్స్ చేసింది. ఈ చిత్రానికి హరీష్‌ జైరాజ్‌ సంగీతం అందించాడు. అయితే బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకున్నా.. మ్యూజికల్‌గా మాత్రం మంచి టాక్‌ తెచ్చుకుంది ఆరెంజ్‌.అయితే అప్పటి జనాలకు నచ్చలేదు. ఇప్పుడీ చిత్రం థియేటర్స్ లో డాన్స్ లు చేయిస్తోంది.

 ఈ పుట్టిన రోజుకు  రామ్ చరణ్ నటించిన RRR లో పాటకి ఆస్కార్ రావడం అలాగే మరో దర్శకుడు శంకర్ తో చేస్తున్న భారీ సినిమా నుంచి కూడా అప్డేట్ రావటంతో  చాలా ఉషారుగా ఉన్నారు. ఆ ఉషారుని రెట్టింపు చేస్తూ తన కెరీర్ లో డిజాస్టర్ కం కల్ట్ క్లాసిక్ హిట్ అయినటువంటి “ఆరెంజ్” రీ రిలీజ్ అయ్యి సెన్సేషన్ టాక్ తెచ్చుకుంది. ఓ డిజాస్టర్ సినిమాని రీరిలీజ్ చేయటం ఏంటని చాలా మంది విమర్శలు చేసారు. కానీ ఊహించని విధంగా ఈ సినిమాకు అప్లాజ్ వచ్చి అందరికీ షాక్ ఇస్తోంది.

మార్కెట్ లో లేటెస్ట్ రిలీజ్ చిత్రాలు ఉన్నప్పటికీ ఆరెంజ్ రీ రిలీజ్ కాగా మాసివ్ రెస్పాన్స్ ఈ సినిమాకి నమోదు అయ్యింది. ఇక మెయిన్ గా అయితే నైజాం రీజన్ లో క్రాస్ రోడ్స్ లో ఆరెంజ్ సినిమా రీ రిలీజ్ లలో అయితే ఆల్ టైం రికార్డు కొట్టడం ఇప్పుడు విశేషం. క్రాస్ రోడ్స్ లో మొత్తం 12 షో లు ప్లాన్ చేయగా 12 కి కూడా హౌస్ ఫుల్ బోర్డ్స్ పడడం విశేషం.

ఈ క్రమంలో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆరెంజ్ చూస్తూ ఓ కొత్త సినిమా రిలీజ్ లాగ  థియేటర్లో హంగామా చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ బర్త్ డే (మార్చి 27) సందర్భంగా ఈ మూవీని రీ రిలీజ్ చేశారు.   మార్చి 25, 26న ఈ సినిమాను భారీ ఎత్తున షోలు వేసారు. అ నాటి డిజాస్టర్ సినిమాకు  క్రేజ్ తో  సోషల్ మీడియా షేక్ అవుతోంది.  హైద్రాబాద్ ఏరియాలో మొత్తంగా 54 షోలు వేస్తే.. అందులో 41 షోలు ఫుల్ అయ్యాయి. విజయవాడలో పది షోలు వేస్తే ఎనిమిది షోలు హౌస్ ఫుల్ అయ్యాయి. ఇక గుంటూరు ఏరియాలో పన్నెండు షోలు వేస్తే ఎనిమిది షోలు హౌస్ ఫుల్ అయ్యాయి. వైజాగ్‌ ఏరియాలో పన్నెండు వేస్తే పదకొండు షోలు హౌస్ ఫుల్ అయ్యాయి.

 నాగబాబు  ఈ సినిమాకు ఎంత కలెక్షన్ వచ్చినా కూడా అది జనసేనకు విరాళంగా ఇస్తాను అని ప్రకటించాడు. అది కొంత కారణం కావచ్చు అని అంటున్నా..రామ్ చరణ్ క్రేజ్ ముందు అవన్నిచిన్న విషయాలే. శని ఆదివారాల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో రీ రిలీజ్ చేయగా అభిమానులు భారీగా తరలివచ్చారు. పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. కొ ఏదైమైనా ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సంధ్య థియేటర్ మెగా అడ్డా అని మరోసారి నిరూపితమైంది. అక్కడ క్షణాల్లో టికెట్లు క్లోజ్ అయ్యాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios