Asianet News TeluguAsianet News Telugu

#Bramayugam:షాక్.. 'భ్రమయుగం' OTT రైట్స్..సినిమా బడ్జెట్ కన్నా ఎక్కువే

దాదాపు రూ.30 కోట్లకు సోనీ లివ్ (Sony LIV) భ్రమయుగం మూవీ డిజిటల్ హక్కులను కొనుగోలు చేసినట్లు  టాక్ వినిపిస్తోంది

All about Mammootty Bramayugam OTT Digital Rights jsp
Author
First Published Feb 29, 2024, 4:28 PM IST | Last Updated Feb 29, 2024, 4:28 PM IST


కొన్ని సినిమాలు ఆశ్చర్యకరమైన బిజినెస్ చేస్తూంటాయి. అలాంటివాటిల్లో మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన హారర్‌ థ్రిల్లర్‌  'భ్రమయుగం'  . ఈ చిత్రం తెలుగు వెర్షన్ వర్కవుట్ కాకపోయినా మళయాళంలో మాత్రం ఇప్పటికీ దుమ్ము దులుపుతోంది.  రూ.28 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ రిలీజైన 9 రోజుల్లోనే రూ.37 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డ్ లు క్రియేట్ చేసింది. అంతేకాకుండా ఈ సినిమా ఓటీటీ రైట్స్ రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. అది కూడా సినిమా బడ్జెట్ ఎంతో అంతకు మించిన రేటుకు అని సమాచారం. 

అందుతున్న సమాచారం మేరకు దాదాపు రూ.30 కోట్లకు సోనీ లివ్ (Sony LIV) భ్రమయుగం మూవీ డిజిటల్ హక్కులను కొనుగోలు చేసినట్లు  టాక్ వినిపిస్తోంది. మమ్ముట్టి కెరీర్లోనే హైయెస్ట్ ధరకు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయిన మూవీగా భ్రమయుగం చెప్తన్నారు. అంటే 28 కోట్లకు ఈ సినిమాని నిర్మిస్తే 30 కోట్లు రైట్స్ తోనే వచ్చిందన్నమాట. ఇది మామూలు విషయం అయితే కాదు.  ఈ సినిమాను మార్చి చివరి వారంలో  స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 
  
స్టోరీ లైన్

17 నాటి గాయకుడు తేవాన్ (అర్జున్ అశోక‌న్‌)  . మలబారు తీరంలో పోర్చుగీసు సేన‌లు త‌క్కువ కులం వారిని బానిస‌లుగా మార్చి అమ్మేస్తున్న టైమ్ అది.  వారికి దొర‌క్కుండా తేవాన్ త‌న ప్రెండ్ తో క‌లిసి అడ‌విలోకి పారిపోతాడు . అయితే అడ‌విలో తేవాన్ క‌ళ్ల ముందే ఓ దుష్ట‌శ‌క్తి బారిన ప‌డి అత‌డి ప్రెండ్  కోరా క‌న్నుమూస్తాడు. దాంతో భయంతో పారిపోయి....ఆ అడవిలో ఉన్న పాడుబడ్డ పెద్ద రాజ భవంతిలోకి వెళ్తాడు. ఆ భవంతిలో కేవలం ఇద్దరు మాత్రమే ఉంటారు. ఒకరు యజమాని కొడుమోన్ పోటి (మమ్ముట్టి).. రెండోది వంటవాడు (సిద్ధార్ధ్ భరతన్). అక్కడ తేవన్ కు మంచి ఆహ్వానమే దొరుకుతుంది. 

‘ఆశ్రయం కోరి ఇంటికి వచ్చిన అతిథిని ఆహ్వానించాలి.. అతను రాజైనా పేదైనా’.. అని తేవన్‌కి   ఆహ్వానించి.. అతనికి ఆశ్రయం కల్పిస్తాడు కోడుమోన్ పోటి. అక్కడ నుంచే అసలు కథ మొదలవుతుంది. కొద్ది రోజులుకు ఆ ఇంటి వెన‌కాల చాలా మంది స‌మాధులు ఉండ‌టం తేవాన్ గ‌మ‌నిస్తాడు.  ఆ తరువాత ఆ భవంతిలో ఏదో మాయాశక్తి ఉందని అర్దం చేసుకుంటారు.  ఇంట్లో క్షుద్ర‌పూజ‌ల ఆన‌వాళ్లు. పారిపోదామనుకుంటాడు. కానీ అతని వల్ల కాదు. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేసిన ప్రతీ సారి కొడుమన్‌ తన తాంత్రిక విద్యలతో అతణ్ని మళ్లీ ఇంటికి వచ్చేలా చేస్తాడు.  అప్పుడు ఏమైంది? (Bramayugam).

అసలు అతన్ని ప్రేమగా ఆహ్వానించి వెళ్లనివ్వకుండా చేస్తున్న  కొడుమన్‌ పొట్టి ఎవరు? అతని ఫ్లాష్ బ్యాక్  ఏంటి? అతని గురించి అంతా తెలిసి కూడా వంటవాడు ఆ ఇంట్లోనే ఎందుకు ఉంటున్నాడు? చివరకు తేవన్‌ ఆ ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడ్డారా? లేదా? అన్నది  ‘భ్రమయుగం’సినిమా చూసి తెలుసుకోవాలి.
  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios