ఆర్ఆర్ఆర్ హీరోయిన్ అలియా భట్ క్రేజ్ అంతకంతకు పెరుగుతోంది. అలియా భట్ ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తోంది. ఒకవైపు ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఆర్ఆర్ఆర్ హీరోయిన్ అలియా భట్ క్రేజ్ అంతకంతకు పెరుగుతోంది. అలియా భట్ ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తోంది. ఒకవైపు ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రస్తుతం అలియా భట్ నటించిన సంజయ్ లీలా భన్సాలీ చిత్రం థియేటర్స్ లో విజయవంతంగా రన్ అవుతోంది. అలాగే భారీ బడ్జెట్ చిత్రం 'బ్రహ్మాస్త్ర'లో అలియా తన ప్రియుడు రణబీర్ కపూర్ సరసన నటిస్తోంది. 

ఇలాంటి తరుణంలో అలియా భట్ అభిమానులకు మరో క్రేజీ న్యూస్. అలియా హాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. అది కూడా అలా ఇలాకాదు.. ఓ క్రేజీ చిత్రంలో హాలీవుడ్ స్టార్ పక్కన అలియా స్క్రీన్ షేర్ చేసుకోనుంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ నిర్మిస్తున్న 'హార్ట్ ఆఫ్ స్టోన్' అనే చిత్రంలో అలియా భాగం కానుంది. 

ఈ చిత్రంలో అలియాతో పాటు 'వండర్ వుమెన్' నటి గాళ్ గోబట్, ప్రముఖ నటుడు జెమీ డోర్నాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ స్వయంగా ప్రకటించింది. ఇక గాళ్ గోబట్ కూడా షూటింగ్ లో పాల్గొంటున్న దృశ్యాలని షేర్ చేసింది. 

హాలీవుడ్ లో అలియా భట్ కి ఇది డ్రీం డెబ్యూ అనే చెప్పాలి. హార్ట్ ఆఫ్ స్టోన్ చిత్రం స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఐశ్యర్యారాయ్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనె లాంటి బాలీవుడ్ హీరోయిన్లు హాలీవుడ్ లో తమ అదృష్టం పరీక్షించుకున్నారు. ఇప్పుడు అలియా కి ఆ ఛాన్స్ దక్కింది. మరి అలియా భట్ అంతర్జాతీయ ప్రేక్షకులని మెప్పిస్తుందో లేదో చూడాలి. ఇటీవల హాలీవుడ్ చిత్రాలకు ఇండియాలో మార్కెట్ బాగా పెరింది. దీనితో హాలీవుడ్ దర్శక నిర్మాతలు ఇక్కడి నటీనటుల వైపు చూస్తున్నారు. 

క్రిస్టఫర్ నోలెన్ తెరకెక్కించిన టెనెట్ చిత్రంలో బాలీవుడ్ నటి డింపుల్ కపాడియా కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా అలియా భట్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాంచరణ్ సరసన సీత పాత్రలో నటించింది. ఆర్ఆర్ఆర్ మూవీ మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

View post on Instagram