మహేష్ గారాల పట్టి సితార సోషల్ మీడియాలో చాల యాక్టీవ్. ఇప్పటికే సీతారకు పేస్ బుక్, ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి. తన క్యూట్ క్యూట్ డాన్సింగ్, సింగింగ్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను, ఫాల్లోవర్స్ ని పెంచుకున్నారు సితార.
 
కాగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ సీతారకు మంచి ఫ్రెండ్. గతంలో మహేష్ కుటుంబం అమెరికా ట్రిప్ లో ఉండగా, అక్కడే ఉన్న అలియా మహేష్ ఫ్యామిలీని కలవడం జరిగింది. అప్పటి నుండి సితార మరియు అలియా మధ్య స్నేహం కొనసాగుతుంది. ఇటీవల ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన అలియా భట్ తన లిటిల్ ఫ్రెండ్ సితార కోసం డ్రెస్ తెచ్చారు.
 
వైట్ టాప్, బ్లూ ఫ్రాక్ ని సితారకు అలియా గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ విషయాన్ని సితార ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. అలాగే అలియా తనకు దుస్తులు తెచ్చినందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. అలియా తెచ్చిన డ్రెస్ తనకు బాగా నచ్చిందని, ఆమెకు ధన్యవాదాలు తెలిపింది. ఆ డ్రెస్ వేసుకొని మురిసిపోతూ ఓ ఫోటోకి పోజిచ్చిన సితార సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.