అక్షయ్‌కుమార్‌  ‘సంఘర్ష్‌’ (1999)లో యంగర్‌ రితూ ఓబెరాయ్‌గా మెరిసిన ఆలియా ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ సినిమాతో హీరోయిన్ గా ఎందరో అభిమానులను సంపాదించుకుంది. ‘హైవే’, ‘2 స్టేట్స్‌’,›‘డీయర్‌ జిందగీ’, ‘రాజీ’, ‘కలంక్‌’, ‘గల్లీ బాయ్‌’....సినిమాలతో తానేమిటో నిరూపించుకుంది ఆలియాభట్‌. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా ఒప్పుకోవటంతో తెలుగులోనూ ఆమెకు క్రేజ్ ఏర్పడింది. కరోనా ఓ కొలిక్కి వచ్చాక డేట్స్ ఇస్తానని ఆర్ ఆర్ ఆర్ నిర్మాలకు చెప్పినట్లు సమాచారం. అదే సమయంలో ఆమె మెగా సినిమా కమిటైందని తెలుస్తోంది. 

ఇండస్ట్రీ లో చెప్పుకునేదాని ప్రకారం..ఆలియా భట్ ని రామ్ చరణ్ సరసన ఆచార్య చిత్రంలో ఎంపిక చేసినట్లు వినికిడి. సెకండాఫ్ లో వచ్చే నలభై నిముషాల ఎపిసోడ్ లో రామ్ చరణ్ కనపడతారు. మాజీ నక్సలైట్ గా రామ్ చరణ్ పాత్ర దుమ్మురేపుతుంది. ఆ పాత్రకు జోడీగా అలియా భట్ ని తీసుకున్నారని చెప్తున్నారు. ఈ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు కీలకంగా మారనుంది. కొరటాల శివ డైరక్ట్ చేస్తున్న ఈ సోషల్ డ్రామా షూటింగ్ కరోనా ఉధృతి తగ్గి పరిస్దితులు యధా స్దితికి వచ్చాక మొదలుకానున్నట్లు సమాచారం. అయితే అలియాభట్ విషయమై ఇంకా అధికారికంగా కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. 

ఆలియాభట్ మరో ప్రక్క  ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గంగూబాయి కతియావాడి’ లో నటిస్తోంది. ముంబై మాఫియా క్వీన్, గ్యాంగ్‌స్టర్‌గా చెప్పుకోబడిన గుంగూబాయి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ఇది. టైటిల్‌ పాత్రలో ఆలియాభట్‌ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం 1970 కాలం నాటి ముంబైలోని కామాటిపుర సెట్‌ను ఓ స్టూడియోలో ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్. లాక్‌డౌన్‌ వల్ల ఈ సినిమా షూటింగ్‌కు వీలుపడలేదు.