Asianet News TeluguAsianet News Telugu

జిమ్ లో అలియా కసరత్తులు.. 70 కిలోలు ఎత్తేసింది!

బాలీవుడ్ నటి ఆలియా భట్ జిమ్‌లో చెమటోడుస్తున్నారు. ఏకంగా 70 కిలోల డెడ్ లిఫ్ట్స్ ఎత్తి అందరినీ ఆశ్చర్యపరిచారు. బహుశా ఆమె ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాకు తగ్గట్టుగా తన శరీరాకృతిని మలుచుకుంటున్నట్లున్నారు.
 

Alia Bhatt Sets Personal Record With 70 Kg Deadlift
Author
Hyderabad, First Published Sep 14, 2019, 11:43 AM IST

మన సెలబ్రిటీల్లో చాలా మందికి ఫిట్నెస్ పిచ్చి ఉంటుంది. తమ రోజువారీ జీవితంలో జిమ్ ని భాగంగా చేసుకుంటారు. ఒకప్పుడు అలియా కాస్త బొద్దుగా ఉండేది. కానీ సినిమాల కోసం బాగా తగ్గింది. ఇప్పుడు ఆమె శరీరాకృతికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఈ బ్యూటీ జిమ్ లో ఏకంగా 70 కిలోల డెడ్ లిఫ్ట్స్ ఎత్తుతూ కనిపించారు. 

అలియా లాంటి శరీరాకృతి ఉన్నవారికి అంతటి డెడ్ లిఫ్ట్స్ మోయడమంటే చాలా కష్టం. కానీ ఆమె తన తదుపరి సినిమాల కోసం జిమ్ లో కష్టపడుతున్నారు. ప్రముఖ సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ సోహ్రాబ్ ఖుష్రూషాహి సమక్షంలో అలియా కసరత్తులు చేస్తుంటారు. అలియాకు ఫిట్నెస్ పై ఉన్న నిబద్ధత పాటలు తాను చాలా సంతోషంగా ఉన్నానని సోహ్రాబ్ వెల్లడించారు.

అయితే ఇంతటి డెడ్ లిఫ్ట్స్ ఎత్తడానికి అలియా మొదట్లో మొహమాట పడేవారట. వీటికోసమే ఆమె జిమ్ కి రావడం మొదలుపెట్టారని.. ఇప్పుడు సోహ్రాబ్ లో చాలా మార్పు కనబడుతోందని.. తన ముందు ఎలాంటి కష్టమైన టాస్క్ ఉన్నా.. ఆమె వెనక్కి తగ్గరని ఆమె డెడ్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు తీసిన వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

ప్రస్తుతం అలియా టాలీవుడ్ లో 'RRR' సినిమాలో నటిస్తోంది. అలానే మహేష్ భట్ దర్శకత్వంలో 'సడక్ 2', అలానే 'తక్త్' సినిమాల్లో నటిస్తోంది. ఆమె నటించిన 'బ్రహ్మాస్త్ర' సినిమా క్రిస్మస్  కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

I’m going to give this star the credit she deserves. When she started off earlier this year - she hadn’t lifted weights too often in her life. It took a while to get her to start enjoying being strong - not skinny - strong! The first time she tried a deadlift, we used one single 20lb dumbbell and that wasn’t even 9 months back. A few weeks back she managed to get in 5 reps at 50 kgs and she rocked it. Today was lifting day and we felt we had the energy to push that weight a little higher. After a few warm up sets she cruised through 3 reps at 60kgs which was a personal best for her anyway (I missed a count and I got the stare). Next, we decided to push it even further and do just 1 rep at 70 kgs - knowing @aliaabhatt she decided to give me 2 for good measure. Love the fact that she just NEVER backs down from what’s put in front of her. New personal best done and now we’re going to try and smash it again, soon. What say? Stay the same @aliaabhatt - we’ve got a lot of work to do. #sohfit #bethebestyou #girlswholift #strongnotskinny

A post shared by SOHFIT (@sohfitofficial) on Sep 12, 2019 at 5:44am PDT

Follow Us:
Download App:
  • android
  • ios