సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సెలబ్రిటీలపై ఫోకస్ ఎక్కువైంది. వారికి సంబంధించిన ప్రతీ డీటైల్ ఇంటర్నెట్ లో ప్రత్యక్షమవుతోంది. అందుకే సెలబ్రిటీలు బయట ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వారి ప్రవర్తన ఏమాత్రం తేడాగా అనిపించినా.. నెటిజన్లు టార్గెట్ చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ నటి అలియా భట్ కి ఇలాంటి 
అనుభవమే ఎదురైంది.

ఓ సినిమా సెట్స్ కి అలియా వస్తోందని తెలుసుకున్న మీడియా వర్గాలు ఆమె కోసం ఎదురుచూసి రాగానే ఫోటోలు తీయడం మొదలుపెట్టారు. అలియా కారులో నుండి దిగిన వెంటనే తన బాడీ గార్డ్ తో దురుసుగా ప్రవర్తించింది. 'ముందు మీరే వెళ్లండి..' అంటూ తనకంటే ముందు వెళ్తున్నాడని బాడీగార్డ్‌ను వెటకారంగా తిట్టారు.

అప్పటికీ 'అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్లు 'ఆలియా మేడమ్..' అంటూ పిలుస్తున్నా..వారిని పట్టించుకోకుండా వారిని ఒకచూపు చూసి తన కారవ్యాన్‌లోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో రికార్డ్ అయిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంతకాలం ఆమెపై విపరీతమైన ఇష్టాన్ని చూపించిన నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. ఇంత పొగరా..? నీకు రక్షణ కల్పిస్తున్న వారికి కనీసపు మర్యాద ఇవ్వడం నేర్చుకో అంటూ క్లాస్ పీకుతున్నారు.

మరికొందరు ప్రియుడు రణబీర్ దగ్గర నుండి ఇలాంటి యాటిట్యూడ్ నేర్చుకున్నావా..? అతడు కూడా ఇలానే దురుసుగా ప్రవర్తిస్తుంటాడని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ 'బ్రహ్మాస్త్ర' అనే సినిమాలో నటించనుంది. తెలుగులో రాజమౌళి రూపొందిస్తోన్న 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటిస్తోంది.  

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#aliabhatt on location

A post shared by Viral Bhayani (@viralbhayani) on Sep 16, 2019 at 3:10am PDT