మాజీ ప్రియుడ్ని లెక్క చేయలేదే..!

First Published 10, May 2018, 1:43 PM IST
alia bhatt ignores siddhath malhotra at sonam kapoors wedding
Highlights

బాలీవుడ్ లో ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్ అనేవి చాలా కామన్. గతంలో హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో 

బాలీవుడ్ లో ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్ అనేవి చాలా కామన్. గతంలో హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో అలియా భట్ సన్నిహితంగా మెలిగేది. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని బాలీవుడ్ మీడియా వార్తలు ప్రచురించేది. కానీ సిద్ధార్థ్ మరికొందరితో క్లోజ్ గా ఉండడం తట్టుకోలేని అలియా అతడిని దూరం పెట్టిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రేమలో ఉన్నప్పుడు ప్రతి వేడుకకు కలిసి వెళ్ళే ఈ జంట ఇప్పుడు ఒకరికొకరు ఎదురైతే కనీసం పలకరించుకోలేని పరిస్థితి.

రీసెంట్ గా బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ కు వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు కొందరు సినీ తారలు హాజరయ్యారు.అక్కడ జరిగిన సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. అలియా-రణబీర్ కపూర్ కలిసి వస్తుండగా అదే సమయానికి సిద్ధార్థ్ మల్హోత్రా కూడా వారి వైపుగా వచ్చాడు. కానీ అలియా అతడిని ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

loader