బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రస్తుతం 'బ్రహ్మాస్త్ర' అనే సినిమాలో నటిస్తోంది. త్వరలోనే 'RRR' సినిమా షూటింగ్ లో పాల్గోనుంది. ఇది ఇలా ఉండగా.. ఇటీవల అలియా తన దగ్గర పని చేసే ఇద్దరు డ్రైవర్ లకు చెరొక పాతిక లక్షలు ఇచ్చి వారిని సర్ప్రైజ్ చేసిందట.

వివరాల్లోకి వెళితే.. అలియా తన 26వ పుట్టినరోజు సందర్భంగా తన దగ్గర చాలా కాలంగా పని చేస్తోన్న సునీల్, అన్మోల్ అనే ఇద్దరు యువకులకు పాతిక లక్షల చొప్పున యాభై లక్షల చెక్ అందజేసిందట.

ఆ డబ్బుతో పాటు ముంబై శివారులో రెండు చిన్న ఫ్లాట్లు కొనుక్కున్నారట. అలియా వారిని తన ఇంట్లో మనుషుల్లానే చూస్తుందట. అందుకే వారికంటూ సొంత ఇల్లు ఉండాలని భావించి డబ్బు ఇచ్చినట్లు తెలుస్తోంది.

వీరికే కాదు.. తన మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టైలిస్ట్, వంట చేసే వారు ఇలా తన వద్ద పని చేసే వారికి ఎలాంటి అవసరం వచ్చినా.. తనే చూసుకుంటుందట.