ఫిబ్రవరి 25న ‘గంగూబాయ్‌ కతియావాడి’ని విడుదల అవుతోంది. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజయ్‌ దేవగణ్‌ కీలకపాత్ర పోషించారు. తెలుగు సహా పలు దక్షిణాది భాషల్లో ‘గంగూబాయి...’ని రిలీజ్‌ చేస్తున్నారు.

 బాలీవుడ్‌ బ్యూటీ ఆలియాభట్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గంగూబాయ్‌ కతియావాడీ’. ముంబయి మాఫియా క్వీన్‌ గంగూబాయ్‌ జీవితచరిత్ర ఆధారంగా దీన్ని రూపొందించారు. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమా కోసం హిందీ సినీ ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా పరిస్థితుల కారణంగా ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఇప్పటికే ఫిబ్రవరి 25న దీన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి డిటేల్స్ సైతం బయిటకు వచ్చాయి.

ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ ప్లిక్స్ భారీ ఆఫర్ ఇచ్చి సొంతం చేసుకుంది. సినిమా రిలీజైన నెల తర్వాత ఈ సినిమాని ఓటిటిలో విడుదల చేస్తారని సమాచారం. అంటే ఈ సినిమా మార్చి 25 కు ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది. గ్యాంగ్‌స్టర్‌ గంగూబాయి కొతేల్‌వాలి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందొందీ చిత్రం. ఎస్ హుస్సేన్ జాడి రచించిన మాఫియా క్వీన్స్ అఫ్ ముంబై నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవ్‌గన్, ఇమ్రాన్ హష్మి గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు.

ఆలియా భట్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటిస్తున్న భారీ మల్టీస్టార్ 'ఆర్ఆర్ఆర్' సినిమాలో సీత పాత్రలో కనిపించబోతోంది. దాంతో ఆమెకు తెలుగు మార్కెట్ ఏర్పడనుంది. ఈ క్రమంలో 'గంగూబాయి కతియావాడి' తెలుగు లోనూ విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ సైతం తెలుగులో రిలిజ్ చేశారు చిత్ర బృందం. ఆలియా భట్ మాట్లాడుతూ 'అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న 'గంగూబాయి కతియావాడి' తెలుగులోనూ టీజర్ విడుదల కావడం గౌరవంగా భావిస్తున్నాను' అంటూ తెలిపారు. ఈ టీజర్‌కి అభిమానుల నుంచి, ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది.