Asianet News TeluguAsianet News Telugu

నిర్మాత‌గా మారి సినిమా తీస్తున్న అలీ..అసలు కారణం

ఎమ్సీ జోసెఫ్ అనే డెబ్యూ డైరెక్టర్ ఈ సినిమాను చాలా హృద్యంగా తెరకెక్కించాడు. మెట్రో స్టేషన్ లో తీసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి..ఓ మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. దాన్ని బేస్ చేసుకునే ఈ మూవీ తీసారు. ఈ చిత్రానికి తెలుగు టైటిల్ ..అందరూబాగుండాలి అందులో నేనుండాలి. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అందరూబాగుండాలి అందులో నేనుండాలి చిత్రం బుధవారం అన్న‌పూర్ణ స్టూడియోస్ గ్లాస్ హౌస్ లో లాంఛనంగా ప్రారంభమైంది. 

Ali turned as producer with Malayali movie remake jsp
Author
Hyderabad, First Published Dec 17, 2020, 9:35 AM IST

తన కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి,హీరోగానూ వెలిగి ప్రస్తుతం టీవీల్లో షోలు చేస్తున్న సీనియర్ కమిడియన్ అలీ. ఆయన నిర్మాతగానూ అవతారం ఎత్తారు. అయితే సేఫ్ సైడ్ గా ఓ రీమేక్ ని ఎంచుకున్నారు. మళయాళంలో సూపర్ హిట్టైన వికృతి అనే చిత్రం రీమేక్ తో నిర్మాతగా లాంచ్ అవుతున్నారు. ఆ సినిమాలో అలీ,నరేష్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.  కేరళలోని కొచ్చీ మెట్రో ట్రైన్ లో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగానే ‘వికృతి’ సినిమా తెరకెక్కింది. 

ఎమ్సీ జోసెఫ్ అనే డెబ్యూ డైరెక్టర్ ఈ సినిమాను చాలా హృద్యంగా తెరకెక్కించాడు. మెట్రో స్టేషన్ లో తీసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి..ఓ మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. దాన్ని బేస్ చేసుకునే ఈ మూవీ తీసారు. ఈ చిత్రానికి తెలుగు టైటిల్ ..అందరూబాగుండాలి అందులో నేనుండాలి. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అందరూబాగుండాలి అందులో నేనుండాలి చిత్రం బుధవారం అన్న‌పూర్ణ స్టూడియోస్ గ్లాస్ హౌస్ లో లాంఛనంగా ప్రారంభమైంది. 
 
అలీ మాట్లాడుతూ... దర్శకుడు కిరణ్ నేను చెన్నై లో రూమ్ మేట్స్, మలయాళం లో జరిగిన ఒక వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీస్తున్నాము. మ‌ళ‌యాలం బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ వికృతి సినిమాకు రీమేక్ ఇది. ఈ కథ నచ్చి వెంటనే నరేష్ గారికి ఈ సినిమా చూడమని చెప్పాను. ఆయనకు ఈ మూవీ బాగా నచ్చి ఈ సినిమా చేస్తున్నాను అన్నారు. పవిత్ర లోకేష్ ఈ సినిమాలో మంచి పాత్రలో నటిస్తున్నారు. సాయి కుమార్ బ్రదర్ రవిశంకర్ ఈ సినిమాలో ఒక పాత్ర చేస్తున్నారు. రాకేష్ మ్యూజిక్ భాస్కరభట్ల సాహిత్యం ఇలా అందరూ పెద్ద టెక్నీషియన్స్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు.

నరేష్ మాట్లాడుతూ... అలీ సినిమా చేస్తున్నాడంటే సినిమాకు ఒక బ్రాండ్ వస్తుంది. తను నేను కలసి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించాము. అందరూబాగుండాలి అందులోనేనుండాలి మంచి కాన్సెప్ట్ తో వస్తోన్న సినిమా అలీ ఈ సినిమాను నిర్మిస్తూ నటిస్తున్నాడు. దర్శకుడు శ్రీపురం కిరణ్ మంచి మార్పులు చేసి బెస్ట్ స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నాడు. ఒక మంచి సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉందని తెలిపారు.

డైరెక్టర్ శ్రీపురం కిరణ్ మాట్లాడుతూ.... అలీ గారు స్థాపించిన అలీవుడ్ బ్యానర్ లో నేను డైరెక్ట్ చెయ్యడం సంతోషంగా ఉంది. నరేష్ గారు మా సినిమా చెయ్యడానికి ఒప్పుకోవడంతో సినిమాకు మరింత క్రేజ్ వచ్చింది. ఈరోజు నుండి చిత్ర షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాము. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సినిమా ప్రేక్షకుల్ని తప్పకుండా అలరిస్తుందని నమ్ముతున్నాను అన్నారు.

హీరోయిన్ మౌర్యానీ మాట్లాడుతూ.. అలీగారంటే అంద‌రికీ అభిమాన‌మే, అలానే ఇందులో మ‌రో కీల‌క పాత్ర చేస్తున్న న‌రేశ్ గారితో క‌లిసి న‌టిస్తుండ‌టం చాలా ఆనందంగా ఉంది. చాలా మంది ప్ర‌తిభావంత‌మైన‌, ఎక్స్ పీరియ‌న్స్ ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్ల‌తో క‌లిసి ప‌ని చేసే అవ‌కాశం రావ‌డం నా అదృష్టంగా భావిస్తున్నారు. ఈ సినిమా క‌చ్ఛింత‌గా ప్రేక్ష‌కుల్ని ఆక్ట‌ట్టుకుంటుంద‌ని ఆశిస్తున్నాను.

 డాక్ట‌ర్ అలీ, డాక్ట‌ర్ విజ‌యకృష్ణ న‌రేశ్, మౌర్యానీ, ప‌విత్ర లోకేశ్ త‌దిత‌రులు నటించే ఈ చిత్రానికి డిఓపి - ఎస్. ముర‌ళి మోహ‌న్ రెడ్డి, సంగీతం - రాకేశ్ ప‌ళిడ‌మ్, పాటలు - భాస్క‌ర‌భ‌ట్ల ర‌వికుమార్, ఎడిట‌ర్ - సెల్వ‌కుమార్, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ - ఇర్ఫాన్, ఆర్ట్ డైరెక్ట‌ర్ - కేవి ర‌మ‌ణ‌ మేక‌ప్ చీఫ్ - గంగాధ‌ర్, ర‌చన, ద‌ర్శ‌క‌త్వం - శ్రీపురం కిర‌ణ్ , బ్యాన‌ర్ - అలీవుడ్ ఎంట‌ర్ టైన్మెంట్స్, నిర్మాత‌లు - అలీబాబ‌, కొనతాల మోహ‌న‌కుమార్.
 

 

Follow Us:
Download App:
  • android
  • ios