టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ పాలిటిక్స్ అడుగులు గత కొన్ని రోజులుగా ఏపి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో జనసేనలో ఆయన చేరకపోవడానికి గల కారణాన్ని చెప్పారు. తెలుగు దేశం పార్టీలో చేరినట్లే చేరి అలీ సడన్ గా వైఎస్సార్ సీపీలోకి  జంప్ చేసిన సంగతి తెలిసిందే. 

అలీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మంచి మిత్రుడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆయనతో చేరతాడని అందరి ఉహించినప్పటికీ ఇప్పుడు జగన్ తో చేరడం చర్చనీయాశంగా మారింది. జనసేనలో చేరకపోవడంపై అలీ ఈ  విధంగా స్పందించారు. 

మా మధ్య స్నేహాన్ని రాజకీయాలతో సినిమాలతో సంబంధం లేకుండా కొనసాగించాలని అనుకుంటున్నా. పవన్ జనసేనలోకి నన్ను పిలవలేదు అని అలీ వివరణ ఇచ్చారు.అందుకే నేను మరో పార్టీలోకి వెళ్లాను అని ఇక కేవలం ఎలక్షన్స్ ప్రచారంలో వైసిపి పార్టీ కోసం పని చేస్తాను అని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అలీ మాట్లాడారు. 

పసివయసులో బాక్స్ ఆఫీస్ హీరోలు