ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'అలవైకుంఠపురములో' చిత్రం హిందీ లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. షెహజాదాగా ఈ చిత్రాన్ని హిందీలో తెరకెక్కించారు. రోహిత్ ధావన్ దర్శకత్వంలో.. యువహీరో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటించారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'అలవైకుంఠపురములో' చిత్రం హిందీ లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. షెహజాదాగా ఈ చిత్రాన్ని హిందీలో తెరకెక్కించారు. రోహిత్ ధావన్ దర్శకత్వంలో.. యువహీరో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటించారు.ఈ చిత్రం నేడు గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. అల్లు అర్జున్ కెరీర్ లో ఈ చిత్రం బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ యూత్, ఫ్యామిలీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని అలరించే విధంగా మ్యాజిక్ చేశారు. ఆ మ్యాజిక్ ని హిందీలో రోహిత్ ధావన్, కార్తీక్ ఆర్యన్ రిపీట్ చేయగలిగారా లేదా.. రివ్యూలో చూద్దాం.
కథ :
తాను పుట్టినప్పుడే బంటు( కార్తీక్ ఆర్యన్) తలరాత మారిపోతుంది. యువరాజులాగా పెరగాల్సిన బంటు సాధారణ మాధ్యతరగతి కుటుంబంలో పెరుగుతాడు. తల్లిదండ్రులకు, తాతగారికి దూరం అవుతాడు. కానీ అతని స్థానంలో ధనవంతుడిగా మరో యువకుడు రాజభోగాలు అనుభవిస్తుంటారు. అసలు ఈ బంటు ఎవరు ? పుట్టినప్పుడు తలరాత మారే విధంగా ఏం జరిగింది ? చివరకి బంటు తన కుటుంబ సభ్యులని చేరుకోగలిగాడా ? అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిన కథ.
విశ్లేషణ :
షెహజాదా రీమేక్ కాబట్టి ప్రతి ఒక్కరూ అల వైకుంఠపురములోతో పోల్చి చూస్తారు. కాసేపు అల్లు అర్జున్ చిత్రాన్ని పక్కనే పెడితే.. షెహజాదాలో కార్తీక్ ఆర్యన్ తన ఎనెర్జిటిక్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. మొదటి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకు అతడి పాత్రలో మంచి జోష్ ఉంటుంది. ఆడియన్స్ తన పాత్రతో కనెక్ట్ అయ్యేలా చేయగలిగాడు.
కృతి సనన్ గ్లామర్ గా కనిపిస్తూ ఆకట్టుకుంది. అవసరమైన చోట నటనతో మెప్పించింది. కానీ ఆమె పాత్రలో అంతగా ప్రాధాన్యత లేదు. సీనియర్ నటుడు పరేష్ రావల్ తనదైన శైలిలో అద్భుతంగా నటించారు. ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. ఆయన పాత్రలో ఉండే ప్రత్యేకత, డైలాగ్ డెలివరీ ప్రతి ఒక్కరిని విశేషంగా ఆకట్టుకుంటాయి. సచిన్ ఖేడ్కర్, రోనిత్ రాయ్, మనీషా కొయిరాల కూడా మంచి నటన కనబరిచారు.
అల వైకుంఠపురములో చిత్రంలో వినోదం, ఎమోషన్స్ ప్రధానంగా కనిపిస్తాయి. షెహజాదాలో కూడా ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసేందుకు దర్శకుడు రోహిత్ ధావన్ ఉన్న అన్ని అవకాశాలని ప్రయత్నించారు. ముఖ్యంగా ఈ చిత్రంలోని కామెడీ, ఫ్యామిలీ డ్రామా హిందీ ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా ఉంటుంది. రీమేక్ చిత్రం కావడంతో రోహిత్ హిందీ ఆడియన్స్ కి అవసరం అయిన కొన్ని మార్పులు చేర్పులు కూడా చేశారు.
ఫస్ట్ హాఫ్ మొత్తం కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జోడి ఆడియన్స్ కి మంచి వినోదం అందించారు. సెకండ్ హాఫ్ లో సినిమా గ్రాఫ్ పడిపోతూ వస్తుంది. అది ఆడియన్స్ ని నిరాశ కలిగిస్తుంది. కొంత మంది నటులు ఆశించిన స్థాయిలో పెర్ఫామెన్స్ ఇవ్వలేకపోయారు. దర్శకుడు రోహిత్ ధావన్ ఫస్ట్ హాఫ్ ని కరెక్ట్ గా డీల్ చేయగలిగారు కానీ సెకండ్ హాఫ్ లో మ్యాజిక్ జరగలేదు. యూట్యూబ్ లో అల వైకుంఠపురములో హిందీ డబ్బింగ్ అందుబాటులో ఉంది. ఇది ఈ చిత్ర వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
టెక్నికల్ గా :
డైరెక్టర్ రోహిత్ ధావన్ ప్రిపేర్ చేసుకున్న వన్ లైన్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. కానీ కొన్ని ఫన్ మూమెంట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ని కరెక్ట్ గా డీల్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. తెలుగులో తరహా యాక్షన్ హిందీ ఆడియన్స్ కి ఏమాత్రం నచ్చుతుందో చూడాలి.
ఇక బ్యాగ్రౌండ్ సంగీతం పర్వాలేదు. సాంగ్స్ మాత్రం వర్కవుట్ కావు. తెలుగులో పాటలే ఆ చిత్రాన్ని పెద్ద ప్లస్ అయ్యాయి. సెకండ్ హాఫ్ లో ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండి ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ సూపర్బ్ అనే చెప్పాలి. సుదీప్ ఛటర్జీ ప్రతి ఫ్రేముని అద్భుతంగా తన కెమెరాలో బంధించారు.
ఫైనల్‌గా: రీమేక్ గా తెరకెక్కిన షెహజాదా చిత్రం హిందీ ప్రేక్షకులని పూర్తి స్థాయిలో మెప్పించడం కష్టమే.
