స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా టైటిల్ ఏమిటా అని గత కొన్ని రోజులుగా కన్ఫ్యూజన్ కి దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. స్వాతంత్య్ర దినోత్సవ సందర్బంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటోంది. ఊహించని విధంగా స్టైలిష్ స్టార్ కి సెట్ చేసిన ఈ క్లాసిక టైటిల్ ని త్రివిక్రమ్ ఎలా ఆలోచించాడో అనే విషయం తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే. 

ఇక బన్నీ లుక్ కూడా చాలా క్లాస్ గా ఉంది మురళి శర్మ ఎంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్ అనగానే.. ఊహించని విధంగా బన్నీ తనకు సూటయ్యే డైలాగ్ ని వదిలాడు. ఇవ్వలేదు.. వచ్చింది అంటూ తాను సినిమా చేయడానికి తీసుకున్న గ్యాప్ ని చెప్పే ప్రయత్నం చేశాడు. ఇక సినిమాలో ఈ డైలాగ్ ఎందుకు వచ్చింధో సినిమా చూస్తే అర్ధమవుతుంది. 

పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో టబు - సుశాంత్ - నవదీప్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. గీతా ఆర్ట్స్ - హారిక హాసిని క్రియేషన్స్ లో సినిమాను అల్లు అరవింద్ - చినబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంగీతం: థమన్.