మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నుంచి రాబోతున్న తదుపరి చిత్రం అల వైకుంఠపురములో.. అల్లు అర్జున్ కథాయనకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. సుశాంత్ - టబు - నవదీప్ వంటి వారు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇకపోతే సినిమా షూటింగ్ గత కొన్ని వారాలుగా గ్యాప్ లేకుండా కొనసాగింది. 

హైదరాబద్ లో వేసిన ఒక కాస్ట్లీ సెట్ లో పలు కుటుంబ సన్నివేశాలు పూర్తి చేశారు. ఇకరీసెంట్ గా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన దర్శకుడు నెక్స్ట్ ప్యారిస్ వైపు అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ అలాగే హీరోయిన్ మధ్య పలు రొమాంటిక్ సీన్స్ ని షెడ్యూల్ లో ప్లాన్ చేసుకున్నారట. మునుపెన్నడూ చూడని లొకేషన్స్ లో లవ్ సీన్స్ ని చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. 

మరి ఆ సన్నివేశాలు ఆడియెన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటాయో తెలియాలంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే. గీత ఆర్ట్స్ - హారిక హాసిని ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. నవంబర్ లో సినిమాకు సంబందించిన మొదటి పాటను రిలీజ్ చేయనున్నారు.