Asianet News TeluguAsianet News Telugu

వివాదాల్లోకి అక్షయ్ కుమార్ యాడ్.. 'వరకట్న వ్యవస్థ'ని ప్రమోట్ చేస్తున్నారంటూ విమర్శలు.. ఆయన ట్వీట్ తో దుమారం..

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ లేటెస్ట్ యాడ్ తో మళ్లీ వివాదాల్లో చిక్కుకున్నారు. 6 ఎయిర్‌బ్యాగ్స్ వెహికిల్స్ తో సురిక్షతమంంటూ యాడ్ చేశారు. ఇది వరకట్న సంస్కృతిని ప్రోత్సహించేదిగా ఉందంటూ ఆరోపణలు చేస్తున్నారు. 

Akshay Kumars Latest Advertisement in controversies, Criticism that he is promoting dowry system
Author
First Published Sep 12, 2022, 6:07 PM IST

కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉండాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) రీసెంట్ గా చేసిన పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో సెన్సేషన్ గా మారింది. వరకట్న వ్యవస్థతో ముడిపడి ఉన్న రోడ్డు భద్రత ప్రచారానికి సంబంధించిన వీడియోను పంచుకున్నారు. అలాగే ఈ యాడ్ షూట్ లో పాల్గొన్న బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kuamr) కూడా రాజకీయ నాయకులు, సోషల్ మీడియా వినియోగదారుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. 6 ఎయిర్‌బ్యాగ్‌లకు మద్దతుగా కేంద్ర మంత్రి గడ్కరీ శుక్రవారం ఒక వీడియోను షేర్ చేయడం మరింత దుమారం రేపుతోంది. 

నితిన్ గడ్కరీ పోస్టు పెడుతూ ‘6 ఎయిర్‌బ్యాగ్‌లతో కూడిన వాహనంలో ప్రయాణించడం ద్వారా జీవితం సురక్షితంగా ఉంటుంది’అని క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోలో అక్షయ్ కుమార్ కూడా కనిపిస్తున్నాడు. అయితే  ఈ యాడ్ పై  చాలా మంది రాజకీయ నాయకులు స్పందిస్తూ ఇది వరకట్న వ్యవస్థను ప్రోత్సహించేదిగా ఉందని, వీరూ ఆ Dowry Systemను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. అయితే, అక్షయ్ వీడియోలో ఎక్కడా 'కట్నం' అనే పదాన్ని ఉపయోగించకపోయినా.. అంటాటి అభిప్రాయాన్ని కలిగించేదిగా వీడియో ఉందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.  

ఈ సందర్భంగా శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది కూడా స్పందించారు. ‘ఇలాంటి ప్రకటనలు సమస్యాత్మకమైనవి. ప్రభుత్వం కారు భద్రత అంశాన్ని ప్రచారం చేయడానికి డబ్బు ఖర్చు చేస్తుందా? లేదా ఈ ప్రకటన ద్వారా వరకట్న సంస్కృతి ప్రచారం చేస్తుందా?’ అని మండిపడ్డారు. అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే కూడా స్పందిస్తూ ‘భారత ప్రభుత్వమే అధికారికంగా వరకట్నాన్ని ప్రోత్సహిస్తుండటం అసహ్యంగా ఉంద’ని విమర్శించారు. మరోవైపు అక్షయ్ కుమార్ పైనా వ్యతిరేకత వస్తోంది. గతంలోనే మత్తు పదార్థం‘విమల్’ యాడ్ షూట్ చేసి విమర్శల పాలయ్యారు. ఆ సమయంలో అభిమానుల నుంచి కూడా వ్యతిరేకత రావడంతో నిష్క్రమించారు. తాజాగా మళ్లీ ‘వరకట్న సంస్కృతి’ పెంపొందిస్తున్నారంటూ నెగెటివిటీ స్ప్రెడ్ అవుతోంది. దీనిపై ఆయన ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios