సినిమాకు అక్షయ్ ఎంత తీసుకుంటాడో తెలిస్తే కళ్లు తిరుగుతాయి

బాలీవుడ్‌ లో ఎక్కువ సంపాదిస్తున్న స్టార్స్‌లో అక్షయ్‌..సినిమాకు తీసుకునే రెమ్యునేషన్ లోనూ టాప్ ప్లేస్ లో ఉన్నారు. ఇంతకీ ఆయన సినిమాకు  పేరు తీసుకుంటారు అంటారా..వింటే మీరు ఆశ్చర్యపోతారు..నమ్ముబుద్ది కాదు. కానీ అది నిజం.

Akshay Kumar will be charging Rs 135 crores jsp

బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉండే స్టార్ ఎవరూ అంటే అక్షయ్ కుమార్ అని చెప్పాలి. ఎప్పుడూ సినిమాలు, బ్రాండ్‌ ప్రమోషన్లు అంటూ అక్షయ్‌ సెట్స్ లోనే ఉంటాడు. దాంతో  ఆయన సంపాదన కూడా అదే స్దాయిలో ఉంటుంది. అలాగే ఇప్పుడు అక్షయ్ కుమార్ మరో రికార్డ్ క్రియేట్ చేసారు. బాలీవుడ్‌ లో ఎక్కువ సంపాదిస్తున్న స్టార్స్‌లో అక్షయ్‌..సినిమాకు తీసుకునే రెమ్యునేషన్ లోనూ టాప్ ప్లేస్ లో ఉన్నారు. ఇంతకీ ఆయన సినిమాకు  పేరు తీసుకుంటారు అంటారా..వింటే మీరు ఆశ్చర్యపోతారు..నమ్ముబుద్ది కాదు. కానీ అది నిజం.

బాలీవుడ్ మీడియా నుంచి అందుతున్న సమాచారం మేరకు అక్షయ్ కుమార్..గతంలో సినిమాకు 117 కోట్లు తీసుకునే వారు. ఇప్పుడు సినిమాకు 135 కోట్లు దాకా తీసుకుంటున్నట్లు సమాచారం. అలాగే ఫోర్బ్స్‌ మేగజీన్‌ ప్రతీ ఏడాది నిర్వహించే సర్వే ప్రకారం ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఆర్జిస్తున్న 100 సెలబ్రిటీలు లిస్ట్‌లో అక్షయ్‌ కుమార్‌ ఉన్నారు. ఈ జాబితాలో ఆయనది 52వ స్థానం. 2020కిగాను అక్షయ్‌ సంపాదన సుమారు 48.5 మిలియన్‌ డాలర్లు. అంటే 356 కోట్లు. ఈ జాబితాలో అమెరికా మేకప్‌ దిగ్గజం, రియాలిటీ టీవీ స్టార్‌ కైలీ జెన్నర్‌ ప్రథమ స్థానంలో ఉన్నారు. ఆమె సంపాదన 590 మిలియన్‌ డాలర్లు. ఇంత రెమ్యునేషన్ తీసుకునే ఈయన బడ్జెట్ లు 50 నుంచి అరవైకోట్లు దాటనివ్వకుండా చూసుకుంటారు.

ఇక సినిమాల విషయానికి వస్తే... సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని బాలీవుడ్‌ టాక్‌. మిషన్‌ మంగళ్‌ చిత్ర దర్శకుడు జగన్‌ శక్తి తెరకెక్కిస్తున్న చిత్రంలో రెండు పాత్రల్లో కనిపించనున్నట్లు బీ- టౌన్‌ సమాచారం. వీరిద్దరి కలయికలో ఇది రెండో చిత్రం. కాగా ఈ చిత్రానికి పేరు ఇంకా ఖరారు కాలేదు. పూర్తి స్థాయి సైన్స్‌ ఫిక్షన్‌ భారీ హంగులతో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం.  ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ విషయం తెలియడంతో అక్కీ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్షయ్‌ గతంలో ద్విపాత్రిభినయంలో నటించిన ‘అప్లాటూన్‌’, ‘రౌడి రాథోడ్‌’, ‘జై కిషన్‌’ చిత్రాలు మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios