కరోనా పాజిటివ్ అని తేలినట్లు తెలుస్తోంది. దీంతో అటు అంబానీ పెళ్లికి, ఇటు తన సినిమా సర్ఫిరా ప్రమోషన్స్‌కు బ్రేక్ ఇస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరోసారి కోవిడ్ బారిన పడ్డారు. తన తాజా చిత్రం సర్ఫిరా (ఆకాశమే నీ హద్దురా హిందీ రీమేక్) ప్రమోషన్ లో ఉన్న ఆయన కొద్దిగా అస్వస్థతకు లోనైన పరీక్షలు చేయించుకున్నారు. అందులో కరోనా పాజిటివ్ అని తేలినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అటు అంబానీ పెళ్లికి, ఇటు తన సినిమా సర్ఫిరా ప్రమోషన్స్‌కు బ్రేక్ ఇస్తున్నారు.
ఇక అక్షయ్ గతంలో రెండుసార్లు కరోనా బారిన పడ్డాడు. 2021లో ఓసారి, 2022లో మరోసారి కోవిడ్‌తో పోరాడాడు. ఆ మహమ్మారిపై విజయం సాధించినప్పటికీ కోవిడ్ లక్షణాలు మాత్రం తనను వెంటాడుతున్నాయని గతంలో వెల్లడించాడు. మునుపటిలా ధృడంగా ఉండలేకపోతున్నానని పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే అక్షయ్ కుమార్ సర్ఫిరా మూవీకి భారీ షాక్ తగిలింది. అక్షయ్ కుమార్ బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్ ఎఫెక్ట్ ఈ మూవీపై గట్టిగా పడింది. తెలుగు రాష్ట్రాలతో పాటు నేషనల్ వైడ్‌గా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ జీరో లెవెల్‌కు పడిపోయాయి. ఈ సినిమా రిలీజైన చాలా థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఒక్క టికెట్ కూడా అమ్ముడుపోలేదు.
మరో ప్రక్క మన హైదరాబాద్‌లో సర్ఫిరా ని ఎవరూ పట్టించుకోలేదు. పోటీగా కమల్ భారతీయుడు 2 మినహా పెద్ద సినిమాలు ఏవి లేకపోయినా అక్షయ్ మూవీని చూడటానికిఆడియెన్స్ అసలు ఇంట్రెస్ట్ చూపడం లేదు. జూలై 11 వరకు హైదరాబాద్‌లో వంద లోపు మాత్రమే టికెట్లు అమ్ముడుపోయాయి. శుక్రవారం రోజు ఉదయం ఆటకు చాలా థియేటర్లు బుకింగ్స్ లేకుండా ఖాళీగా దర్శనమిస్తోన్నాయి.
