Asianet News Telugu

'సాహో' కు సలాం చేసి అక్షయ్ కుమార్ సైడ్ !

ఇన్నాళ్లగా ఏ తెలుగు హీరో చేయని పని ప్రభాస్ చేస్తున్నారు. తన సినిమా రిలీజ్ తో బాలీవుడ్ ని భయపెడుతున్నారు.  ఓ రీజనల్ లాంగ్వేజ్ చిత్రాల హీరో ...దేశం మొత్తం రిలీజ్ అయ్యే హిందీ చిత్రాల్లో వణుకు రప్పించటం అంటే మాటలా.  ఇదే ట్రేడ్ వర్గాల్లో నడుస్తున్న అంశం. 

Akshay Kumar's 'Mission Mangal' to avoid clash with Prabhas' 'Saaho
Author
Hyderabad, First Published Jun 2, 2019, 3:26 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఇన్నాళ్లగా ఏ తెలుగు హీరో చేయని పని ప్రభాస్ చేస్తున్నారు. తన సినిమా రిలీజ్ తో బాలీవుడ్ ని భయపెడుతున్నారు.  ఓ రీజనల్ లాంగ్వేజ్ చిత్రాల హీరో ...దేశం మొత్తం రిలీజ్ అయ్యే హిందీ చిత్రాల్లో వణుకు రప్పించటం అంటే మాటలా.  ఇదే ట్రేడ్ వర్గాల్లో నడుస్తున్న అంశం. ప్రభాస్ సాహో చిత్రం తో ఢీకొట్టేందుకు బాలీవుడ్ హీరోలు సైతం ఆలోచిస్తున్న‌ట్టే అర్ధమవుతోంది. 

ఎందుకిలా అనాల్సి వస్తోందంటే..సాహో ఆగ‌స్టు 15న వ‌స్తున్న సంద‌ర్భంగా కిలాడీ అక్ష‌య్ కుమార్ తాను న‌టిస్తున్న మిష‌న్ మంగ‌ల్ చిత్రాన్ని ప్రీపోన్ చేసుకున్నాడు. నిజానికి త‌న సినిమాని ఆగ‌స్టు 15న రిలీజ్ చేయాల‌ని భావించినా.. అదే రోజు సాహో నుంచి తీవ్ర‌మైన పోటీ త‌ప్ప‌దని గ్ర‌హించి తప్పుకున్నాడు. 

అక్ష‌య్ తెలివిగా ఆగ‌స్టు 9న త‌న సినిమాని రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నాడు. దాంతో చిన్నా చితకా చిత్రాలను ప్రక్కన పెడితే..ఆగ‌స్టు రేసులో అత్యంత క్రేజీ మూవీగా ప్ర‌భాస్ సాహో మాత్ర‌మే రిలీజ‌వుతోంది. ఆ సినిమా వ‌సూళ్ల సునామీ ముందు ఇత‌రులంతా సైడివ్వాల్సిందే అంటున్నారు అభిమానులు. 

దాదాపు 250 కోట్ల బ‌డ్జెట్ తో బాహుబ‌లి త‌ర్వాత మ‌ళ్లీ అంతే ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. సుజీత్ ద‌ర్శక‌త్వంలో యువి క్రియేష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జాకీ ష్రాఫ్, పూజా భేడీ, నీల్ నితిన్ ముఖేష్ వంటి బాలీవుడ్ స్టార్లు ఇందులో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios