ఈమధ్య కొన్ని కాంబినేషన్లు.. చాలా గ్యాప్ తీసుకుని కలుస్తున్నాయి. అది కూడా పదేళ్లు.. ఇరవై ఏళ్ళ తరువాత కాంబోలు రిపిట్ అవుతున్నాయి. తాజాగా బాలీవుడ్ లో అలాంటి కాంబోనే సందడి చేయబోతుంది.
బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్. ఇండస్ట్రీ తో సబంధం లేకుండా.. భాషతో సంబంధం లేకుండా.. కొన్ని వింత కాంబోలతో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈక్రమంలో ఈమధ్య మరో కొత్త ట్రెండ్ తాజాగా వైరల్ అవుతుంది. అదేంటి అంటే.. ఒకప్పుడు తెరపైన దుమ్ము రేపిన కొన్ని కాంబినేషన్లు మళ్లీ లాంగ్ టైమ్ తరువాత వెండితెరపై సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. ఈక్రమంలో సౌత్ నుంచి విజయ్ - జ్యోతిక కాంబో 20 ఏళ్ల తరువాత సందడి చేయబోతున్నట్టు న్యూస్ వైరల్ అయ్యింది. అలాగే టాలీవుడ్ లో కూడా మెగాస్టార్ చిరంజీవి- త్రిష కాంబినేషన్ కూడా ఇలానే సందడి చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి.
ఇక ఇలానే బాలీవుడ్ లో కూడా ఓ కాంబినేషన్ రెండు దశాబ్ధాల తరువాత కలవబోతున్నట్టు తెలుస్తోంది. అది మరెవరో కాదు.. అక్షయ్ కుమార్ మరియు రవీనా టండన్ అక్షయ్ కుమార్ ఓ మై గాడ్ 2 సినిమా సూపర్‌హిట్ అవ్వడంతో సీక్వెల్స్ పై గట్టిగా దృష్టి పెట్టాడు. దీంతో సీక్వెల్స్ విషయంలో ఆయన ఓ నిర్ణయానికి వచ్చేశాడట. మరిన్ని సినిమాలకు సీక్వెల్స్ చేయాలని చూస్తున్నాడట అక్షయ్. అందులో భాగంగా.. బడే మియాన్ చోటే మియాన్, హౌస్‌ఫుల్ 5, వెల్‌కమ్ 3 చేయబోతున్నాడట. ఇందులో వెల్‌కమ్ 3 సినిమా కోసం అక్షయ్ కుమార్, రవీనా టాండన్‌తో చాలా కాలం తరువాత మళ్లీ కలిసి నటించనున్నారని తెలుస్తోంది.
ఈ జంట గతంలో వెండితెరపై గట్టిగా మోత మోగించారు. మొహ్రా, దావా, ఖిలాడియోన్ కా ఖిలాడి, కీమత్, బరూద్ వంటి సినిమాల్లో నటించి మెప్పించారు. అంతే కాదు బాలీవుడ్ లో వీరిపై రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి కూడా. జ జీవితంలో అక్షయ్ కుమార్, రవీనా టాండన్ నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ వివిధ కారణాల వల్ల విడిపోయారు. ఇద్దరూ కలసి నటించిన ఆఖరి చిత్రం పోలీస్ ఫోర్స్. ఇప్పటికి ఇన్నాళ్లకు ‘వెల్‌కమ్ 3’లో మళ్లీ కలసి నటించబోతున్నారు అని సమాచారం.
