Asianet News TeluguAsianet News Telugu

అక్షయ్ కుమార్ కోసం ఓ మహిళా అభిమాని చేసిన పనికి అంతా షాక్, అప్పుడు అక్షయ్ ఏం చేశాడంటే..?

బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్ రీసెంట్ గా ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. గతంతో ఓ మహిళా అభిమాని చేసిన పని గుర్తు తెచ్చకున్నారు బాలీవుడ్ స్టార్ హీరో. 

Akshay kumar prithviraj movie Promotions
Author
Hyderabad, First Published May 28, 2022, 6:34 AM IST

అక్షయ్ కుమార్.. బాలీవుడ్ లో 100 కోట్ల హీరో.. ఇప్పుడు 150 కోట్ల వరకూ తీసుకుంటున్నారని వినికిడి. అయితే ఈ స్టార్ హీరో అంటే ఇష్టపడనివారు ఎవరుంటారు చెప్పండి. అక్షయ్ కుమార్ హీరోగానే కాకుండా..వ్యక్తిత్వం పరంగా కూడా ఎంతో మంది అభిమానులను సంపాధించారు. ఆయనకు అన్ని భాషల్లో డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఆ అభిమానం వల్ల ఇబ్బంది పడ్డ సందర్బాలు కూడా లేకపోలేదు. 

బాలీవుడ్‌ స్టార్  హీరో అక్షయ్‌ కుమార్‌ సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకురానున్నారు. జూన్‌ 3న హిందీతో పాటు సౌత్ లాంగ్వేజెస్ లో కూడా ఈ సినిమా తెరపైకి రాబోతున్నది. డాక్టర్‌ చంద్రప్రకాష్‌ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడుపుతున్నాడు అక్షయ్ కుమార్. రిలీజ్ కు ఎక్కువ సమయం లేకపోవడంతో.. సినిమా ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారు అక్షయ్‌. ఈ ప్రమోషన్స్ సందర్భంగా తన కెరీర్‌లో జరిగిన ఆసక్తికర ఘటనలూ పంచుకుంటున్నారు అక్షయ్ కుమార్. 

ఈ క్రమంలో ఒక మహిళా అభిమాని తన మీద ఉన్న ఇష్టంతో చేసిన ఓ పిచ్చి పని గురించి అక్షయ్ వివరించారు. తన మీద ప్రేమతో.. తన కోసం ఓ లేడీ ఫ్యాన్ ఇంటి నుంచి పారిపోయిన సంగతి చెప్పారు అక్షయ్‌. ఆయన మాట్లాడుతూ…నన్ను చూడాలని ఒక మహిళా అభిమాని ఇంటి నుంచి పారిపోయి వచ్చింది. ఆ విషయం నాకు ఆలస్యంగా తెలిసింది. ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలియదు. ఈ విషయం నా దృష్టికి రాగానే వాళ్ల తల్లిదండ్రులను పిలిచి మాట్లాడాను. ఆ తర్వాత ఆమె క్షేమంగా ఇళ్లు చేరిందని తెలిసింది అని అన్నారు. 

ఈ సందర్భంగా  ఫ్యాన్స్ కు కొన్ని సూచనలు కూడా ఇచ్చారు. అభిమానులను నేను చాలా గౌరవిస్తాను. అయితే మీకూ ఒక వ్యక్తిగత జీవితం ఉంటుందని, మాకంటే దానికే విలువ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తుంటాను అని చెప్పారు. అక్షయ్ కుమార్ చెప్పిన ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అక్షయ్ కుమార్ అభిమానుల కోసం ఎంతో ఆలోచిస్తారంటూ.. ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios