బాలయ్య కథతోనే ...అక్షయ్ ఈ చిత్రం చేస్తున్నారా?
అక్షయ్ కుమార్ తాజా చిత్రం మిషన్ రాణిగంజ్ పేరుతో ఒక సర్వైవర్ థ్రిల్లర్ ని మన మన ముందుకు తీసుకు వస్తున్నారు. ఇది 1989లో జరిగిన నిజ జీవిత విషాద సంఘటన ఆధారంగా తెరకెక్కింది.

మీకు గుర్తుందో లేదో అప్పట్లో ‘నిప్పు రవ్వ’ అనే చిత్రం వచ్చింది. రకరకాల కారణాలతో ఆ నిప్పు రవ్వ నెక్ట్స్ లెవిల్ కు వెళ్లకుండానే ఆరిపోయింది. అయితేనేం బాలయ్య కెరీర్ లో అదో గుర్తుంచుకోదగ్గ సినిమా. ఆనాటి స్టార్ డైరక్టర్ కోదండరామి రెడ్డి తో బాలయ్య బాబు చేసిన ఈ ‘నిప్పు రవ్వ’ సినిమాని స్వయంగా విజయశాంతి నిర్మించింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాలేదు కానీ, ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ పరంగా యావరేజి అని అనిపించుకుంది. ఈ సినిమాకి నిర్మాతగా బాధ్యతలన్నీ విజయశాంతి చేపట్టినప్పటికీ స్క్రీన్ మీద తన పేరు కాకుండ తన భర్త పేరు MV శ్రీనివాస్ ప్రసాద్ పేరునే వేసుకుంది.. ఈ సినిమా తర్వాత విజయశాంతి మళ్ళీ నిర్మాణ రంగం వైపు చూడలేదు.
ఈ సినిమా విడుదల రోజే బాలయ్య బాబు హీరో గా నటించిన ‘బంగారు బుల్లోడు’ సినిమా కూడా విడుదల అవ్వటం మైనస్ గా మారింది. ఇప్పుడీ ‘నిప్పు రవ్వ’ టాపిక్ ఎందుకూ అంటే...అక్షయ్ కుమార్ తాజా చిత్రం మిషన్ రాణిగంజ్ పేరుతో ఒక సర్వైవర్ థ్రిల్లర్ ని మన మన ముందుకు తీసుకు వస్తున్నారు. ఇది 1989లో జరిగిన నిజ జీవిత విషాద సంఘటన ఆధారంగా తెరకెక్కింది.
గతంలో అక్షయ్ కు రుస్తుం రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన దర్శకుడు టిను సురేష్ దేశాయ్ దీన్ని డైరక్ట చేస్తున్నారు. రీసెంట్ గా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అక్టోబర్ 6న థియేటర్లలో వచ్చే ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్టు.. ‘నిప్పు రవ్వ’ కాన్సెప్టు ఒకటే కావటం విశేషం. ‘నిప్పు రవ్వ’చిత్రాన్ని రాణి గంజ్ బొగ్గు గనుల్లో జరిగిన విషాదాన్ని ఆధారంగా చేసుకుని ఇక్కడ కమర్షియల్ ఎలిమెంట్స్ కలుపుతూ...తెలంగాణా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. ఇప్పుడు అదే రాణి గంజ్ బొగ్గు గనుల్లో జరిగిన ట్రాజడీనే మిషన్ రాణిగంజ్ చిత్రం మెయిన్ కాన్సెప్టు. అయితే రియలిస్టిక్ గా కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
బొగ్గు గనుల్లో వందలాది కార్మికులు పూర్తిగా తవ్వకాల్లో ఉండగా హఠాత్తుగా నీరొచ్చి మైన్ ని ముంచేయటం జరిగింది.ఆ ప్రమాదంలో 220 కార్మికులు పని చేస్తున్న సమయంలో ఆరుగురు చనిపోగా 68 మందిని రక్షించి బయటికి తీసుకొచ్చారు. అదే రాణిగంజ్ నేపథ్యం. ‘నిప్పు రవ్వ’ నేపధ్యం కూడాను. మరి అక్షయ్ ఈ సినిమాతో హిట్ కొడతారో లేదో చూడాలి.