భారీ ట్రోలింగ్ భరించలేకపోయారు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. అభిమానుల కోసం వెనకడుగు వేయక తప్పలేదు. మాటతప్పినందకు క్షమానణలు కూడా చెప్పారు బాలీవుడ్ స్టార్ హీరో. అసలు ఆయన ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు.
భారీ ట్రోలింగ్ భరించలేకపోయారు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. అభిమానుల కోసం వెనకడుగు వేయక తప్పలేదు. మాటతప్పినందకు క్షమానణలు కూడా చెప్పారు బాలీవుడ్ స్టార్ హీరో. అసలు ఆయన ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు.
స్టార్ హీరోలు.. ఫిల్మ్ సెలబ్రిటీలు సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్ తో భారీగా సంపాదిస్తుంటారు. అయితే ఈమధ్య సౌత్ స్టార్స్ కు ఈ పిచ్చి పట్టుకుంది కాని. ముందు నుంచీ బాలీవుడ్ స్టార్ హీరోలంతా బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. అయితే అప్పుడప్పుడు అవి వివాదాలకు దారి తీస్తుంటాయి.
ఈమధ్య స్టార్స్ సినిమాలను మించి కమర్షియల్ యాడ్స్ లో నటిస్తున్నారు. బాలీవుడ్ లో ఎక్కువ బ్రాండ్స్ ను ప్రమోట్ చేసే హీరోలలో అక్షయ్ కుమార్ ముందు వరసలో ఉంటారు. సినిమాకు దాదాపు 100 కోట్ల వరకూ తీసుకుంటున్న స్టార్ హీరో..వచ్చిన ప్రతీ కమర్షియల్ బ్రాండ్ ను వదిలిపెట్టడకుండా చేస్తుంటాడు. అయితే ఈ విషయంలో గతంలో ప్యాన్స్ కు ఓచిన్న మాట ఇచ్చాడు అక్షయ్.
జనాలకు హని చేసే ఎటువంటి ప్రాడెక్ట్స్ ను తాను ప్రమోట్ చేయనని గతంలో చెప్పారు అక్షయ్ కుమార్. ముఖ్యంగా జనాల ప్రాణాలతో ఆటలు ఆడే టోబ్యాకో ఉత్పత్తులను తాను ఎకరేజ్ చేయనన్నారు. గుట్కా, మందు వంటి వాటికి తానెప్పుడూ అడ్వర్‌టైజ్ చేయనని అక్షయ్ గతంలో చెప్పాడు. పెద్ద పెద్ద గుట్కా కంపెనీలు భారీ ఎత్తున డబ్బులివ్వడానికి కూడా సిద్ధపడ్డాయి, కానీ తాను మాత్రం అలాంటివాటిని ప్రమోట్ చేయనన్నాడు
అయితే రీసెంట్ గా అక్షయ్ కుమార్ మాట తప్పారు. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవ్‌గణ్, అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్ పాన్ మసాలా యాడ్‌లో కలిసి నటించారు. ఇది పెద్ద దుమారాన్నే రేపింది. అయితే పాన్ మసాలా యాడ్‌లో అభిమాన హీరో కనిపించడాన్ని చూసి తట్టుకోలేకపోయారు అక్షయ్ ఫ్యాన్స్. ఇలాంటి ప్రకటనలో నటించడమేంటని మండిపడ్డారు. ఆరోగ్యానికి హాని చేసే ఉత్పత్తులను తానెప్పటికీ ప్రమోట్ చేయనని చెప్పి ఇప్పుడెందుకిలా చేస్తున్నాడని ఫైర్ అవుతున్నారు.
అప్పుడు అన్ని కాకమ్మ కథలు చెప్పి.. మరి ఇప్పుడెందుకు మాట తప్పాడు? అంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అక్షయ్ సార్ మా మనసు విరిచేశాడని మరికొందరు బాధపడుతున్నారు. ఈ పరిణామాలతో అక్షయ్ కుమార్ దిగి వచ్చారు. ఈ భారీ ట్రోలింగ్ ను ఆయన భరించలేక పోయారు. దెబ్బకు దిగివచ్చి అభిమానులకు, ఆడియన్స్ కు సారీ చెప్పారు.
గురువారం అర్దరాత్రి ఓ నోట్ ను రిలీజ్ చేశారు అక్షయ్ కుమార్. అభిమానులకు, ఆడియన్స్ కు మనస్పూర్తిగా క్షమాపణలు చెప్పారు. ఈ పాన్ మసాలా ప్రమోషన్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. గతకొద్ది రోజులుగా మీ నుంచి వస్తున్న స్పందనలు నన్ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఇకముందు ఇలాంటి పొరపాటు చేయను. చట్టబద్దమైన ప్రకటనల్లో నటించడానికి మాత్రమే ప్రేయారిటీ ఇస్తానన్నారు అక్షయ్ కుమార్. ఈవిధంగా ఓనోట్ ను ఆయన సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.