#Nagarjuna నాగ్ హీరో... అక్షయ్ కుమార్ విలన్?
నాగ్ కి నార్త్ సర్కిల్స్ లో మంచి గుర్తింపే ఉంది. ‘బ్రహ్మాస్త్ర’లో నాగ్ ఓ కీలక పాత్ర పోషించారు.
కెరియర్ పరంగా నాగార్జునకి 'నా సామిరంగ' 99వ సినిమా అనే విషయం తెలిసిందే. సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ చిత్రం ద్వారా . విజయ్ బిన్నీ దర్శకుడుగా పరిచయం అయ్యారు. గ్రామీణ నేపథ్యంలో సాగిన ఈ సినిమా హిట్ అనిపించుకుంది. ఈ నేపధ్యంలో నాగార్జున 100వ సినిమా ఎవరు చేయబోతున్నారనే విషయాలు హాట్ టాపిక్ గా మారాయి.. మోహన్ రాజా దర్శకత్వంలో నాగార్జున 100వ సినిమా ఉండే ఛాన్స్ ఉండనే టాక్ ఆ మధ్య బలంగా వినిపించింది. కానీ ఇప్పుడు తమిళ దర్శకుడు నవీన్ పేరు తెరపైకి వచ్చింది.
ఇటీవల వచ్చిన 'అగ్ని సిరగుగల్' ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టింది. విజయ్ ఆంటోని - అరుణ్ విజయ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఆ సినిమాను ఆయన డీల్ చేసిన తీరు నాగార్జునకి నచ్చిందట. అందువల్లనే ఆయన నవీన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. జ్ఞానవేల్ రాజా ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తాడని చెప్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్న ఈ చిత్రం ఓ మల్టీస్టారర్ అవకాసం ఉందంటున్నారు. ఈ చిత్రంలో మరో కీలకమైన పాత్ర కోసం అక్షయ్‌కుమార్ పేరు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అక్షయ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అక్షయ్ ఓకే చేస్తే ఖచ్చితంగా భారీగా ఓ పాన్ ఇండియా సినిమా రెడీ అవుతుంది. నాగ్ కి నార్త్ సర్కిల్స్ లో మంచి గుర్తింపే ఉంది. ‘బ్రహ్మాస్త్ర’లో నాగ్ ఓ కీలక పాత్ర పోషించారు.
అక్షయ్ చేస్తే ఈ సినిమాకి ఓ క్రేజ్ వస్తుందనటంలో సందేహం లేదు. ఇదో యాక్షన్ ఎంటర్‌టైనర్ అని, అక్షయ్ విలన్ గా కనిపించే ఛాన్సుంది అంటున్నారు. అయితే ఏ విషయం ఫైనల్ కాలేదు. అంతా సెట్ అయ్యితే నాగ్ వందో సినిమాగా దీన్నే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.