అమెరికన్‌ బిజినెస్‌ మ్యాగజీన్‌ ఫోర్బ్స్‌ 2019 ఏడాదికిగాను విడుదల చేసిన రిచెస్ట్ యాక్టర్స్ లిస్ట్ లో అక్షయ్ కుమార్ చోటు సంపాదించుకున్నాడు. ఎప్పుడు లేని విధంగా అక్షయ్ మొదటిసారి తన సంపాదనను పెంచుకొని ఫోర్బ్స్ లిస్ట్ లోకి చేరుకున్నాడు. మొదటి స్థానంలో 89.4 మిలియన్‌ డాలర్స్ సంపాదనతో  హాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌ డ్వేన్‌ జాన్సన్‌ ఉన్నాడు. 

2018 జూన్ 1 నుంచి 2019 మే 31వరకు సినీ తారల సంపాదనను లెక్కల్లోకి తీసుకొని ఫోర్బ్స్ తాజా ర్యాంకులను విడుదల చేసింది. ఇక అక్షయ్ కుమార్ ఈ లిస్ట్ లో 65 మిలియన్ల డాలర్స్ సంపాదనతో నాలుగవ స్థానంలో నిలిచాడు. గత ఏడాది నుంచి ఈ కిలాడీ హీరో వరుసగా సినిమాలను చేస్తూ బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకుంటున్నాడు. 

అలాగే ఇతర ప్రముఖ ఇంటర్నేషనల్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నాడు. యాడ్స్ తో పాటు పలు బిజినెస్ రంగాల్లో అక్షయ్ కి మంచి లాభాలు అందాయి. దీంతో 460కోట్లకు పైగా సంపాదనతో ఈ స్టార్ హీరో ఫోర్బ్స్ మ్యాగజీన్ లో స్థానం సంపాదించుకున్నాడు.