బాలీవుడ్ విలక్షణ నటుడు అక్షయ్ కుమార్ పౌరసత్వం గురించి ఇటీవల ఎన్నికల సందర్భంగా పెద్ద చర్చే జరిగింది. దీనితో అక్షయ్ కుమార్ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్షయ్ కుమార్ కు కెనడా పౌరసత్వం ఉన్న కారణంగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అక్షయ్ ఓటు వేయలేకపోయారు. దీనితో అతడిపై అనేక విమర్శలు ఎదురయ్యాయి. దీనితో అక్షయ్ కుమార్ మాట్లాడుతూ తన మాతృ దేశం ఇండియానే అని తేల్చి చెప్పాడు. తాను ఇక్కడే పనిచేస్తూ, టాక్సులు చెల్లిస్తున్నానని వివరించాడు. 

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోల్లో ముందుగా సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుఖ్ లాంటి హీరోలే గుర్తుకొస్తారు. కానీ సంపాదనతో అక్షయ్ కుమార్ బాలీవుడ్ నటులందరినీ అధికమించేశాడు. తాజాగా బాలీవుడ్ నటులు 2017-18 ఆర్థిక సంవత్సరానికిగాను వాణిజ్య ప్రకటనల ద్వారా పొందిన ఆదాయ వివరాలు వెలువడ్డాయి. వాణిజ్య ప్రకటనల ద్వారా వార్షిక ఆదాయంలో అక్షయ్ కుమార్ 100 కోట్లతో టాప్ లో నిలిచాడు. 

బాలీవుడ్ క్రేజీ కపుల్స్ రణవీర్ సింగ్, దీపికా పదుకొనె లని తొక్కేసి అక్షయ్ కుమార్ అగ్ర స్థానానికి ఎగబాకాడు. అక్షయ్ కుమార్ తర్వాత రెండవ స్థానంలో రణవీర్ సింగ్ 84 కోట్ల ఆదాయంతో ఉన్నాడు. మూడవ స్థానంలో అతడి భార్య దీపికా పదుకొనె 74 కోట్ల ఆదాయంతో ఉంది. సల్మాన్ ఖాన్, అమితాబ్, షారుఖ్ లాంటి అగ్రనటులంతా వెనుకబడిపోయారు. 

72 కోట్లతో అమితాబ్ నాల్గవ స్థానంలో, ఆ తర్వాతి స్థానాల్లో అలియా భట్ 68 కోట్లు, షారుఖ్ ఖాన్ 56 కోట్లు, వరుణ్ ధావన్ 48 కోట్లు, సల్మాన్ ఖాన్ 40 కోట్లు, కరీనా కపూర్ 32 కోట్లు, కత్రినా కైఫ్ 30 కోట్లతో వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయం పొందారు.