కమల్ హాసన్ - రజినీకాంత్ లు ఒకే తెరపై కనిపించాలని గత కొంత కాలంగా ఎంతో మంది అభిమానులు కోరుకుంటున్నారు. అయితే అది తీరని కలలానే మిగిపోయింది. గతంలో కొంత మంది దర్శకులు ఈ కాంబోని సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేసినప్పటికీ అది వర్కౌట్ కాలేదు. 

మంచి కథ దొరికితే ఇద్దరం సినిమా చేయడానికి రెడీ అని చాలా ఫంక్షన్స్ లో ఈ స్టార్ హీరోలు క్లారిటీ ఇచ్చారు. అయితే వారిద్దరిని ఎలాగైనా సింగిల్ ఫ్రెమ్ లో నేను డైరెక్ట్ చేస్తానని అక్షర హాసన్ చెబుతోంది. ఇప్పుడిపుడే నటీమణిగా అడుగులు వేస్తున్న ఈ లోకనాయకుడి కూతురు డైరెక్షన్ అండ్ రైటింగ్ స్కిల్స్ బాగానే ఉన్నాయి. 

రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్షర హాసన్ కమల్ హాసన్ - రజినీకాంత్ లను తప్పకుండా డైరెక్ట్ చేస్తానని ఒక మంచి మల్టీస్టారర్ చేయడానికి రెడీ అని తెలిపింది. ఇక అది సెట్టవ్వకపోయిన తన తండ్రితో ఒక సూపర్ హీరో కంటెంట్ ను తెరకెక్కిస్తాను అని అక్షర వివరణ ఇచ్చింది, మరి ఈ బేబీ పెద్ద పెద్ద కోరికలు ఎప్పుడు నెరవేరతాయో చూడాలి.