Asianet News TeluguAsianet News Telugu

#The Ghost : బాక్సాఫీస్ వద్ద ‘ది ఘోస్ట్’ యావరేజ్ స్టార్ట్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇలా.!

అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తాజాగా నటించిన యాక్షన్ ఫిల్మ్ ‘ది ఘోస్ట్’. ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు వసూళ్లు మాత్రం చాలా షాకింగ్ గా ఉన్నాయి. 

Akkineni Nagarjuna The Ghost Movie First Day Collection Detailes
Author
First Published Oct 6, 2022, 3:16 PM IST

పవర్ ఫుల్ రా ఏజెంట్ పాత్రలో అక్కినేని నాగార్జున నటించిన సాలిడ్ యాక్షన్ ఫిల్మ్ ‘ది ఘోస్ట్’ (The Ghost). విభిన్న కథలతో అలరిస్తున్న నాగార్జున ఆరుపదుల వయస్సుల్లోనూ యాక్షన్ సీన్స్ తో అదరగొడుతున్నారు.  అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కిన చిత్రం ‘ది ఘోస్ట్’ నిన్న దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్స్ మాత్రం చాలా షాకింగ్ ఉన్నాయి. తాజాగా ట్రేడ్ వర్గాలు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి..

‘ది ఘోస్ట్’ తొలిరోజు బాక్సాఫీస్ వద్ద అవరేజ్ స్టార్ ను అందుకుంది.  ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన ఈ చిత్రం తక్కువ స్థాయి స్కోర్‌ను నమోదు చేసింది. మొదటి రోజు కేవలం రూ.4.6 కోట్ల గ్రాస్ ను మాత్రమే వసూల్ చేసింది. అయితే నిన్న మెగా స్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ కూడా రిలీజ్ కావడంతో అభిమానుల చూపు మెగా సినిమాపై పడింది. పైగా పండుగ కూడా రావడంతో నాగ్ ‘ది ఘోస్ట్’ అంతగా ఆసక్తి క్రియేట్ చేయలేకపోయింది. మరోవైపు మిక్డ్స్ టాక్ తోనూ తొలిరోజు ఓపెనింగ్స్ ను భారీ స్థాయిలో దక్కించుకోలేకపోయింది.

ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. ఏరియా వైజ్ ‘ది ఘోస్ట్’ షేర్ వసూళ్లు ఇలా ఉన్నాయి..
నైజాం        : రూ. 57 లక్షలు
సీడెడ్        : రూ.24L లక్షలు
యూఏ       : రూ.31 లక్షలు 
తూర్పు      : రూ. 23L లక్షలు
వెస్ట్           : రూ. 8L లక్షలు
గుంటూరు : రూ. 22  లక్షలు 
కృష్ణ          : రూ. 20 లక్షలు
 నెల్లూరు   :  రూ. 15 లక్షల షేర్ వసూల్ చేసింది.  ఏపీ - తెలంగాణలో మొత్తం రూ. 2.00CR షేర్ రాగా రూ.3.60 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. కర్ణాటక మరియు మిగిలిన రాష్ట్రాల్లో రూ.20 లక్షలు, అదేవిధంగా ఓవర్సీస్ లో రూ. 25 లక్షలు రాబట్టింది. ఇదీ కలుపుకొని  ప్రపంచ వ్యాప్తంగా మొత్తంగా రూ.2.45 కోట్ల షేర్ వసూల్ చేయగా..  రూ. 4.60 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఇదీ చాలా నార్మల్ ఓపెనింగ్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.  

ఇక  ప్రపంచవ్యాప్తంగా 700 థియేటర్లలో విడుదలైన  ‘ది ఘోస్ట్’ మూవీ AP-TGలో 410+ థియేటర్లు, ఓవర్సీస్ 200 థియేటర్లు మిగిలిన  భారతదేశంలో 90 థియేటర్లను కలిగి ఉంది. మరోవైపు ఈ చిత్రం వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను 21.15 కోట్లకు అమ్ముడు పోయాయి. తెలుగు హక్కులు రూ.16 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇదిలా ఉండగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.22 కోట్లుగా ఉంది.‘గాడ్ ఫాదర్’ దుమ్ములేపుతుండటంతో ‘ది ఘోస్ట్’ ఎంత వరకు వసూళ్లు రాబడుతుందో చూడాలి. 

ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. నాగార్జున, సోనాల్ చౌహాన్ హీరోహీరోయిన్లుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు అత్యద్భుతమైన నిర్మాణ విలువలతో రూపొందించారు. భారతీ సౌరభ్ మరియు మార్క్ సంగీతం అందించారు.  రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, జయప్రకాశ్ తదితరులు కీలక పాత్రల్లో  నటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios