ప్రముఖ సీనియర్ ప్రొడ్యూసర్ నారాయణ దాస్ కే నారంగ్ లేరనే విషయాన్ని సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటుున్నారు. తాజాగా అక్కినేని ఫ్యామిలీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నివాళి అర్పించారు.
టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఏషియన్ ఫిలింస్ అధినేత, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నారాయణ్ దాస్ కె.నారంగ్ (78) అనారోగ్యంతో మంగళ వారం కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అస్వస్థతో ఇబ్బంది పడుతున్న నిర్మాత నారాయణ్ దాస్ కే నారంగ్ ఈరోజు తుదిశ్వాస విడిచారనే నిజాన్ని సినీ ప్రముఖులు జీర్ణించుకోలేపోతున్నారు. ఈ సందర్భంగా ఆయన తో ఉన్న అనుబంధాన్ని తెలుపుతూ సోషల్ మీడియా వేదికన సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
కొన్నిరోజులుగా ఓప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న నారాయణ్ దాస్... పరిస్థితి చేయి దాటడంతో తుది స్వాస విడిచారు. దీంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మరణానికి సంతాపం వ్యక్తం చేస్తూ అక్కినేని ఫ్యామిలీ నుంచి కింగ్ నాగార్జున (Nagarjuna), నాగ చైతన్య (Naga Chaithanya) నారంగ్ ఇంటికి వెళ్లారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా నారంగ్ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ‘శ్రీ నారాయణ దాస్ నారంగ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి. ప్రముఖ సినీ పంపిణీ దారు, ఎగ్జిబిటర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు శ్రీ నారాయణ దాస్ నారంగ్ మృతికి చింతిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నేను నటించినన చిత్రాల్లో కొన్నింటిని వారి సంస్థ ద్వారా పంపిణీ చేశారు. శ్రీ నారంగ్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులుగా సేవలందిస్తున్నారు. ఆయన కుమారుడు శ్రీ సునీల్ నారంగ్, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.’ అంటూ ఎమోషనల్ గా ప్రకటనలో పేర్కొన్నారు.
ఆస్ప్రత్రి నుంచి సొంటింకి తరలించిన నారాయణ దాస్ నారంగ్ పార్థివ దేహాన్ని సినీ ప్రముఖులు సందర్శిస్తున్నారు. పూలమాలతో భౌతిక కయానికి నివాళి అర్పిస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీతో పాటు, నిర్మాత సురేష్ బాబు, తదితర సినీ ప్రముఖులు వచ్చి నివాళి అర్పించారు.
