తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నత స్థానాన్ని అందుకోవడంలో ఏఎన్నార్ కృషి ఎంతో ఉంది. ఆయన్ని స్పూర్తిగా తీసుకొని ఎందరో టాలెంటెడ్ హీరోలు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయన కుమారుడు అక్కినేని నాగార్జున తన తండ్రిని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 

'ఈరోజు నాన్న పుట్టినరోజు.. మీ జీవితంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. మిమ్మల్ని మిస్ అవుతున్నాం.. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం' అంటూ రాసుకొచ్చారు. అక్కినేని ఇంటి కోడలు సమంత కూడా ఏఎన్నార్ ను గుర్తు చేసుకుంటూ ప్రొఫైల్ పిక్చర్‌లో ఏఎన్నార్ నటించిన సినిమాల్లోని పాత్రలన్నీ కలిపిన ఫొటోలన్నీ కలిపి ఉన్న ఇమేజ్‌ను
పెట్టుకున్నారు.

ఏఎన్నార్ మనవడు సుశాంత్ తన తాతను గుర్తు చేసుకుంటూ ఆయనతో దిగిన ఓ ఫోటోని షేర్ చేశారు. 1924 సెప్టెంబర్ 20న కృష్ణా జిల్లాలోని రామాపురంలో జన్మించారు నాగేశ్వరరావు. 1941లో వచ్చిన ‘ధర్మపత్ని’ సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించారు నాగేశ్వరరావు. ఆయన కెరీర్‌లో దాదాపు 244 సినిమాల్లో నటించారు.2014 జనవరి 22న ఏఎన్నార్ అనారోగ్యం కారణంగా మరణించారు.