చిరంజీవి ఏడుస్తుంటే హమ్మయ్య అని వెళ్లిపోయాను-నాగార్జున

First Published 21, Dec 2017, 5:21 PM IST
akkineni nagarjuna about hello movie and chiranjeevi promotion
Highlights
  • అఖిల్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వస్తోన్న హలో మూవీ
  • రేపే విడుదలకు సిద్ధమైన అఖిల్ హలో
  • ఈ మూవీలో కల్యాణ్ ప్రియదర్శన్ హిరోయిన్
  • ప్రీమియర్ షోకు హాజరైన మెగాస్టార్ చిరంజీవి

అఖిల్ హీరోగా వస్తోన్న హలో మూవీ ప్రమోషన్ లో భాగంగా నాగార్జున మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పబ్లిసిటీ తక్కువ చేస్తున్నారని మా టీమ్ అంతా చెప్తున్నారు. మంచి సినిమా తీస్తే ఆధరిస్తారని ఆశిస్తున్నా. మేం చేయాల్సిందంతా చేశాం. అఖిల్ మూవీ కాబట్టి మరింత ఇష్టం ఏర్పడింది. మంచి సినిమా ఇస్తే ఆటోమేటిగ్గా హిట్ అవుతుందని నమ్మే ఒక మంచి సినిమా తీశాం. అఖిల్ కూడా దెబ్బతిన్న కసితో పనిచేశాడు. ఆ కసి,ఎనర్జీ హలో సినిమాలో కనిపిస్తుంది. విక్రమ్ కుమార్ కు నిజంగా థాంక్స్ చెప్తున్నా.

 

ఇక ఈ మధ్య అక్కడా ఇక్కడా ట్విటర్ లో చదివా. అన్నిట్లో నాగార్జున జోక్యం అని. కానీ నా ప్రమేయం పోస్ట్ ప్రొడక్షన్ లో వుంటుంది తప్ప కథ ఓకే అయాక ప్రి ప్రొడక్షన్ లో నా ప్రమేయం వుండదు. పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ టైం ఇవ్వాలనే ఆలోచన తప్ప వేరే జోక్యం వుండదు. క్రియేటివిటీకి సంబంధించి ప్రతి సెకన్ కు క్రెడిట్ దర్శకుడు విక్రమ్ కుమార్ కే. నేను కేవలం మంచి నిర్మాతగా మాత్రమే వుంటాను. క్రియేటివ్ పీపుల్ కు టైమ్ సెన్స్ వుండదు కాబట్టి తొందరపెట్టడం తప్ప మరేంలేదు. సినిమాలో అఖిల్ ను ఎలా చూడాలనుకున్నానో అలా చూశా. కల్యాణి ప్రియదర్శన్ తన గురువుగారి అమ్మాయైనా విక్రమ్ ఫుల్ గా స్క్రీన్ టెస్ట్ లు చేసాకనే మూడునెలల తర్వాత తీసుకున్నాడు. తను కూడా చాలా బాగా చేసింది.

 

ఇక ప్రి రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి గారిని రమ్మన్నాను. సినిమా చూసి నచ్చితేనే రండి అన్నాను. ఫ్రెండ్ గా చెప్తున్నాను అని చెప్పాను. ఆయన సినిమా చూసి వచ్చారు. సినిమా చూశాక నాకు కన్నీళ్లు వచ్చాయి. ఎందుకంటే సినిమా అవగానే హ్యాపీనెస్ తో రెండు నిమిషాలు చిరంజీవిగారు మాట్లాడలేకపోయారు. దాంతో నాకు బరువు దిగిపోయినట్లయింది. అలా అఖిల్ ను ప్రసంశించడం చాలా హ్యాపీ. పదిహేను నిమిషాలు వచ్చినా చాలన్నాను. కానీ గంటన్నర సేపు వున్నారు. చరణ్ కూడా రావటం చాలా హ్యాపీ. ఇక మెగాస్టార్ ఫ్యాన్స్ కూడా వచ్చారు. అక్కినేని ఫ్యాన్స్ కూడా వచ్చారు. అదంతా చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక మేం డెలివరీ చేసేశాం. మీ ముందుకు వస్తున్నాం. అందమైన బేబీని తయారుచేశాం. మీరు అలాగే ఫీలవుతారనుకుంటున్నా. మీ అందరి ఆశీర్వాదాలతో హలో బాక్సాఫీస్ హిట్ గా నిలుస్తుందని ఆశిస్తున్నా. మనం అయిపోగానే రిలీజ్ కు ముందే విక్రమ్ తో అఖిల్ కు సినిమా చేయాలన్నా. సూర్య తో 24 ఒప్పుకున్నాను దాని తర్వాత చేస్తానన్నాడు చేశాడు.

 

శివ, గీతాంజలి లాంటి నాకు కనెక్ట్ అయిన సినిమాల తరహాలోనే అఖిల్ కు హలో సినిమా వుంటుంది. పాత తరహా సినిమాలు తీస్తే జనం చూడరు. కొత్తదనం వుండాలని అఖిల్ కు చెప్పా. విక్రమ్ కూడా అన్ని విభాగాల్లో.. సాంగ్స్, డాన్స్ ఇలా అన్ని విభాగాల్లో ఎమోషన్స్ పండించారు. శివ, గీతాంజలిలో ఎంత ఎంటర్ టైన్మెంట్ వుందో అంతకన్నా ఎక్కువే హలోలో వుంటుంది.

 

అసలు అఖిల్ హలో సినిమాకు పాడుతున్నట్లు నాకు ముందు తెలియదు. సడెన్ గా ఓ రోజు హలో కోసం ఓ పాట రికార్డ్ చేశాం, వినండి నాన్నా అని అఖిల్ వినిపించాడు. నేను షాక్ అయాను. నీ వాయిస్ లాగుందిరా ఇదేదో అన్నా. దాంతో నవ్వేశాడు. వెంటనే అనూప్ కో ఫోన్ చేసా. సర్ ప్రైజ్ చేద్దామనే చెప్పలేదన్నాడు. అసలు పాటలంటే తెలియని అఖిల్, బాత్ రూమ్ సింగర్ కూడా కాదు.. కానీ మూడు నెలలు కష్టపడి పాడాడు. అఖిల్ లో బెంగాలీ బ్లడ్ వుంది.  అమల చెప్పేది బెంగాలీ వాళ్లంతా పాటలు పాడుతారట. ప్రమోషన్ ఎలా చేయాలనుకున్నప్పుడు అఖిల్ పాడతాడు కదా.. సింగింగ్ షోలతో చేస్తే బాగుంటుందని అలా ప్రమోషన్ చేశాం.

 

అఖిల్ కొంచెం ట్రెయినింగ్ తో.. పార్ కోర్.. ఫైట్స్ చేశాడు. బాబ్ బ్రౌన్ యుఎస్ లో... చేసి చేసి ఇండియన్ ఫిల్మ్ చేయాలని వున్నదన్నాడు. మా ఫ్రెండ్ తనకు మెయిల్ పెడదాం అనటంతో స్క్రిప్ట్ పెట్టేశాం. నచ్చేసి వచ్చేశాడు. అఖిల్ ఫైట్ చేసేశాడు. కొడుకు కాబట్టి ఎక్కువ ఖర్చు పెడుతున్నారని అడుగుతున్నారు. అవును. అఖిల్ కాబట్టే ఎక్కువ ఖర్చుపెట్టాను. కానీ ఉయ్యాల జంపాల తరహాలో పలు హిట్స్ తీసి,  ఇదే రేంజిలో ప్రమోట్ చేసిన చరిత్ర అన్నపూర్ణ స్టూడియోస్ ది అన్నారు. రాజన్నకు 18కోట్లు ఖర్చు పెట్టాం. అప్పుడు అడగలేదుగా. కొత్త దర్శకులతో తీస్తున్నప్పుడు ఎవరూ ఖర్చు పెడ్తున్నారని అడగలేదే. అవును. అఖిల్ కాబట్టే ఎక్కువ ఖర్చుపెట్టాను. ఈ సినిమాలో రమ్యకృష్ణను ఎలాగైనా పెట్టాలి అని, అఖిల్ కు మదర్ గా రోల్ ఇచ్చాం. జగపతిబాబు ఈ సినిమాలో మీకు బాగా నచ్చేస్తాడు.

 

ఫ్యాన్స్ కు కొత్తగా ఏం చెప్తాం, చైతూ సమంత రిసెప్షన్ లో కొందరిని చూశాను. నాన్నగారున్నప్పటి నుంచి వచ్చిన ఫ్యాన్స్ వచ్చారు. కర్రపట్టుకుని వచ్చిన వాళ్లు కూడా మేం మీకు ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పటికీ మాపై వాళ్లకు ప్రేమ వుంది. వాళ్లంటే నాకెంతతో ప్రేమ. మా అభిమానులు ఎన్ని రోజులు ఆడింది, వసూళ్లేంటి అని లెక్కపెట్టరు. బాగుందా బాగలేదా అనేది మాత్రమే మా ఫ్యాన్స్ ఆలోచిస్తారు.నాకు చైతూ, అఖిల్ ల సినిమాల గురించి పట్టించుకునే ఓపిక లేదు. నేను నిర్మిస్తేనో, నటిస్తేనో తప్ప పట్టించుకోను.

 

ఆర్జీవీని హలో చూడమని అడిగాను. థియేటర్లో చూసి ఫేస్ బుక్ లో పెడతాలే అన్నాడు. వర్మ కు,, నాకు మధ్య స్నేహం ప్రత్యేకమైనది. కొన్ని పదాలు మెసేజ్ లు పెడతాడు. అవి బయటికి చదవలేం. జనం అనుకుంటున్నట్లుగా మాకేం ఈగో క్లాష్ లేదు. చాలా ఫ్రెండ్లీగా వుంటాం.

 

విక్రమ్ ను చైతూతో సినిమా అడిగితే చేస్తానన్నాడు. ఒక సినిమా బయట చేసి వస్తా. వచచ్చే ఏడాది ద్వితీయార్థంలో చైతూ సినిమా మొదలు పెడతా. అమల నా చుట్టూ డాన్సులేసింది. నా కడుపు నిండిపోయింది. అమల అమ్మగారికి తెలుగు పెద్దగా రాదు. ఐరిష్ అయినా ఇప్పటికీ మూడు సార్లు చూసింది. తదుపరి నానితో చేయబోతున్నాం. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వస్తోంది. నాని డైలాగ్ డెలివరీ స్మూత్ గా వుంటుంది. త్వరలోనే చేయబోతున్నాం.

 

ఇక ప్రస్థుతం నిండా మునిగినాక చలి ఎందుకనిపిస్తోంది. నిన్నటి వరకు చలిపెట్టింది. పొద్దట్నించి రేపు చూసుకుందాంలే అనిపిస్తోంది. 5 నిమిషాలు ఖాళీగా వుంటే ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. అందుకే ఏదో ఒక పని పెట్టుకుని అలా నిద్ర పట్టాక పడుకుంటున్నా. ప్రస్థుతానికి మాకు తెలుగే ముఖ్యం. తర్వాతే వేరే ఆలోచనలు అన్నారు.

ఇక చిరంజీవి గారు సినిమా చూసి నన్ను కంటతడి పెట్టించారు. చిరంజీవి గారు వాళ్ల ఫ్యామిలీ నుంచి సినిమాకు కొందరిని తీసుకొచ్చారు. కొన్ని సందర్భాల్లో కర్చీఫ్ తీసుకుని తుడుచుకున్నారు. నేను గమనించాను.. అప్పుడు చిరంజీవి ఏడుస్తుంటే హమ్మయ్య అని వెళ్లిపోయాను అని నాగార్జున అన్నారు. ఇక చైతూ సామ్ కూడా ప్రమోషన్ లో పాల్గొంటారని నాగార్జున తెలిపారు.

loader