Naga chaitanya: నాగ చైతన్య కొత్త ఛానల్, ఇంట్లో ఖాళీగా ఉంటున్నానంటూ కామెంట్స్..
ప్రస్తుతం సినిమా తారలంతా సోషల్ మీడియాను నమ్ముకుంటున్నారు. రకరకా ప్రయోగాలు చేస్తున్నారు. ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. తాజాగా అలాంటి ప్రయోగమే చేశారు అక్కినేని హీరో నాగచైతన్య.

టాలీవుడ్ యంగ్ హీరోలలో నాగచైతన్య కూడా ఒకరు. అక్కినేని వారింటి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాగ చైతన్య.. సాలిడ్ హిటో కోసం ఎదరు చూస్తున్నాడు. రీసెంట్ గా కస్టడీ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఆయన.. ఈసినిమాతో డిజాస్టర్ ను ఫేస్ చేశాడు. ఇక తాజాగా ఆయన ఓ వెబ్ సిరీస్ ద్వారా రాబోతున్నారు. అతి త్వరలో దూత సిరీస్ ద్వారా ఆడియన్స్ ముందుకి రానున్నారు చైతన్య. మరోవైపు తన కెరీర్ 23వ సినిమాను యంగ్ డైరెక్టర్ చందూ మొండేటితో చేసందుకు రెడీ అయ్యాడు చైతన్య.
Naga chaitanya: చైల్డ్ కేర్ సెంటర్ లో నాగచైతన్య, చిన్నారులతో సరదాగా గడిపిన టాలీవుడ్ హీరో ..
ఇక సినిమా సెలబ్రిలు అంటే.. సినిమాతో పాటు ప్రస్తుతం సోషల్ మీడియా కూడా గుర్తుకువస్తుంది. ఎందుకంటే.. ఏ స్టార్ కుసబంధించిన అప్ డేట్ చూడాలన్నీ.. ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లోనే చూడాలి. అయితే ట్విట్టర్ , లేకుంటే.. ఇన్ స్టా గ్రామ్ అది కాకుంటే ఫేస్ బుక్, యూట్యూబ్ లాంటివి.. ఇలా సోషల్ మీడియా ఫ్లాట్ పామ్స్ లో యాక్టీవ్ గా ఉంటూ ఫ్యాన్స్ కు కావల్సిన అప్ డేట్ తో పాటు, మంచి మంచి కంటెంట్ ఇస్తూ..వారిని ఎంటర్టైన్ చేస్తున్నారు సెలబ్రిటీలు.
ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు తమకు సంబంధించిన విశేషాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఎక్స్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌తోపాటు యూట్యూబ్ ద్వారాను ప్రేక్షకులకు చేరువలో ఉంటున్నారు. వారికి సంబంధించిన సినిమాల అప్ డేట్స్ ను అందిస్తూ.. వాటికి కావల్సిన ప్రమోషన్స్‌ను కూడా ఈ వేదికల ద్వారా ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి చైతూ వచ్చి చేరాడు. అక్కినేని నాగచైతన్య పేరుతో ఛానల్‌ను రూపొందించి ఆయన.. అందులో శుక్రవారం ఓ వీడియో పోస్ట్ చేశాడు. యూట్యూబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టానంటూ వెల్లడించాడు.
ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర జవాబులు ఇచ్చాడు. ఇందులో భాగంగా ఓ నెటిజన్ జుట్టు, గడ్డం పెంచడానికి కారణం తెలుసుకోవచ్చా..? అని ప్రశ్నించాడు. దీనికి చైతూ బదులిస్తూ.. ఆరు నెలలుగా జాబ్ లేదని, ఇంట్లో ఖాళీగా ఉంటున్నట్లు చెప్పాడు. పనేంలేక జుట్టు, గడ్డం పెంచినట్లు సరదాగా సమాధానమిచ్చాడు. ఆ తర్వాత తాను హీరోగా నటిస్తున్న చందూ మొండేటి తెరకెక్కించనున్న సినిమా కోసం ఈ లుక్ అంటూ.. క్లారిటీ ఇచ్చాడు చైతూ.