అక్కినేని అఖిల్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'మిస్టర్ మజ్ను' సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్రబృందం. వాటికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.

ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలని అఖిల్ తెగ కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో ఓ పాట కోసం అఖిల్ షర్ట్ విప్పేసి, సిక్స్ ప్యాక్ తో డాన్స్ చేశాడట. సిక్స్ ప్యాక్ స్క్రీన్ మీద పెర్ఫెక్ట్ గా ప్రాజెక్ట్ కావడం కోసం పాట షూటింగ్ జరిగినన్ని రోజులు కూడా అఖిల్ ఏమీ తినకుండా.. రోజుకి లీటర్ వాటర్ మాత్రమే తాగుతూ చాలా కష్టపడ్డాడట.

అఖిల్ ఏం తినకుండా డాన్స్ చేస్తుండడంతో అతడికి ఏమైనా అవుతుందని భయపడ్డ నిర్మాతలు  ఆక్సిజన్ సిలెండర్, ఫస్ట్ ఎయిడ్ సెటప్ మొత్తం సిద్ధం చేశారట. అఖిల్ అంతగా కష్టపడి చేసిన పాట ఎలా ఉంటుందో చూడాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే..

ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను భోగవల్లి ప్రసాద్, బాపీనీడు నిర్మిస్తున్నారు.