అక్కినేని యంగ్ హీరో అఖిల్ బర్త్ డే సందర్భంగా నిన్న (8 ఏప్రిల్)  గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు అక్కినేని ఫ్యాస్స్. ఇక ఈ సందర్భంగా అక్కినేని ఫ్యాన్స్ కు నిర్మాత అనిల్ సుంకర సారీ చెప్పారు. బర్త్ డే  విషెష్ తో  పాటు ఆయన సారీ ఎందుకు చెప్పారు...?  

అక్కినేని న‌ట‌ వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన హీరో అక్కినేని అఖిల్ ఫస్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్టు కోసం ఎంత‌గానో ఎదురుచూస్తున్నాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచీ వ‌రుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న అఖిల్‌కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ తో కాస్త ఊర‌ట‌ లభించింది. ఈ సినిమాతో రిలీఫ్ అయితే వచ్చింది కాని.. అఖిల్‌కు మాత్రం భారీ హిట్టును ఇవ్వ‌లేక‌పోయింది. 

ఇక ఈసారి ఎలాగైనా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్టు కొట్టాల‌ని చూస్తున్నాడు అఖిల్ అందుకే పక్కా మాస్ సినిమా కోసం సురేంద‌ర్ రెడ్డితో చేతులు క‌లిపాడు. ప్ర‌స్తుతం వీళ్ళ కాంబోలో తెర‌కెక్కుతున్న సినిమా ఏజెంట్‌. అఖిల్ ఈ సినిమా కోసం పూర్తీగా మేకోవ‌ర్ అయ్యాడు. ఇప్పటి వరకూ రిలీజ్ అయిన పోస్టర్స్ లో అఖిల్ టోన్డ్ బాడీతో అదరగొడుతున్నారు. అఖిల్ నిజంగా అఖిలేనా.. అని అనుమానం కలిగేలా తయారయ్యాడు.కండ‌లు తిరిగిన దేహంతో అఖిల్ రా ఏజెంట్‌ గా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు.

ఇక ఈ పరిస్థితుల్లో అఖిల్ బర్త్ డే వచ్చింది అంటే.. ఖచ్చితంగా అఖిల్ సినిమా నుంచి భారీగా ఎక్స్ పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్. స్పెషల్ ప్రోమోగాని, టీజర్ గాని, అఖిల్ ఇంట్రెడెక్షన్ వీడియో ఏమైనా రిలీజ్ చేస్తారేమె అని ఫ్యాన్స్ వెయిటింగ్ చేస్తున్నవేళ.. ఒక చిన్న పోస్టర్ తో సరిపెట్టారు నిర్మాత. దాంతో అక్కినేని అభిమానులకు నిర్మాత అనిల్ సుంకర క్షమాపణలు చెప్పారు. అక్కినేని ఫ్యాన్స్ కు సారీ అంటూ ట్వీట్ చేశారు. 

Scroll to load tweet…

అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఏజెంట్’ టీజర్ ను రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ, దానిని వాయిదా వేశారు. దీంతో అక్కినేని అభిమానులకు అనిల్ సుంకర సారీ చెబుతూ వివరణ ఇచ్చారు. మేం అభిమానులు కోరుకున్న దానికన్నా ఎక్కువ, అత్యున్నతమైన టీజర్ ను ఇవ్వాలనుకుంటున్నాం. అందుకే మీకు వెయిటింగ్ తప్పడం లేదు. కానీ, ఆ వెయిటింగ్ కు తగ్గట్టే వచ్చే నెలలో అత్యంత నాణ్యమైన థియేట్రికల్ టీజర్ ను విడుదల చేస్తామని హామీ ఇస్తున్నా.. అంటూ అనిల్ సుంకర ట్వీట్ చేశారు.

ఇక మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముట్టీ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఏకే ఎంట‌ర్టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌తో క‌లిసి సురేంద‌ర్ రెడ్డి ఈ సినిమాను స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కిస్తున్నాడు. ఇదివ‌ర‌కే ఏజంట్ నుంచి రిలీజ్ అయిన ప్రమోషన్ వీడియోస్ కు ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాల‌ను స్టార్ట్ అయ్యాయి. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ సినిమా ఆగ‌స్టు 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.