అక్కినేని యంగ్ హీరో అఖిల్ 28వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాడు. యంగ్ హీరో ఈ ఏడాది డిఫరెంట్ లుక్ తో రాబోతున్నాడు. బర్త్ డే సందర్భంగా కొత్త లుక్ తో ఫ్యాన్స్ ను పలకరించాడు హీరో. 

అక్కినేని యంగ్ హీరో అఖిల్ 28వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాడు. యంగ్ హీరో ఈ ఏడాది డిఫరెంట్ లుక్ తో రాబోతున్నాడు. బర్త్ డే సందర్భంగా కొత్త లుక్ తో ఫ్యాన్స్ ను పలకరించాడు హీరో. 

అక్కినేని న‌ట‌ వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన హీరో అక్కినేని అఖిల్ ఫస్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్టు కోసం ఎంత‌గానో ఎదురుచూస్తున్నాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచీ వ‌రుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న అఖిల్‌కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ తో కాస్త ఊర‌ట‌ లభించింది. ఈ సినిమాతో రిలీజ్ వచ్చింది కాని.. అఖిల్‌కు మాత్రం భారీ క‌మ‌ర్షియ‌ల్ హిట్టును ఇవ్వ‌లేక‌పోయింది. 

ఇక ఈసారి ఎలాగైనా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్టు కొట్టాల‌ని చూస్తున్నాడు అఖిల్ అందుకే సైరా ఫేమ్ సురేంద‌ర్ రెడ్డితో చేతులు క‌లిపాడు. ప్ర‌స్తుతం వీళ్ళ కాంబోలో తెర‌కెక్కుతున్న సినిమా ఏజెంట్‌. అఖిల్ ఈ సినిమా కోసం పూర్తీగా మేకోవ‌ర్ అయ్యాడు. ఇప్పటి వరకూ రిలీజ్ అయిన పోస్టర్స్ లో అఖిల్ టోన్డ్ బాడీతో అదరగొడుతున్నారు. అఖిల్ నిజంగా అఖిలేనా.. అని అనుమానం కలిగేలా హల్క్ లా తయారయ్యాడు.కండ‌లు తిరిగిన దేహంతో అఖిల్ రా ఏజెంట్‌ గా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు.

ఇక రీసెంట్ గా మేక‌ర్స్ రిలీజ్ చేసిన చేసిన పోస్ట‌ర్‌లో అఖిల్ సిగ‌రెట్ తాగుతూ మాస్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు. మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముట్టీ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఏకే ఎంట‌ర్టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌తో క‌లిసి సురేంద‌ర్ రెడ్డి ఈ సినిమాను స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కిస్తున్నాడు. ఇదివ‌ర‌కే ఏజంట్ నుంచి రిలీజ్ అయిన ప్రమోషన్ వీడియోస్ కు ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాల‌ను స్టార్ట్ అయ్యాయి. 

అయితే అఖిల్ పుట్టినరోజు సంద‌ర్భంగా ఈ చిత్రం నుంచి టీజ‌ర్‌గాని, గ్లింప్స్‌గాని వ‌స్తుంద‌ని అక్కినేని అభిమానులు భావించారు. కానీ మేక‌ర్స్ పోస్ట‌ర్‌తోనే స‌రిపెట్టుకున్నారు. దీనికి మేక‌ర్స్ క్ష‌మాప‌ణ‌లు తెలుపుతూ మేలో టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తామ‌ని వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ సినిమా ఆగ‌స్టు 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.